Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
సమాజంలో రోజురోజుకు పెరిగిపోతున్న అంతరాలు దోపిడీదారుల కుట్రలకు సబ్బండ కులాలు బలవుతున్నాయని, మూఢనమ్మకాలు, అజ్ఞానం వైపు ప్రజలు తీసుకెళ్తున్నారని, విజ్ఞానం వైపు మళ్ళించడమే జన జాతర ఉద్దేశమని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మి నారాయణ అన్నారు. కేవీపీఎస్, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సోమవారం దేవరకొండ పట్టణంలో పూలే, అంబేద్కర్ జనజాతర కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 28న నల్లగొండ ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్లో పూలే అంబేడ్కర్ జన జాతర జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యఅతిథిగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసిం, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్ బాబు, గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్. శ్రీరామ్ నాయక్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చోలేటి ప్రభాకర్, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పగడాల నాగేందర్, గాదే లింగస్వామి, అనిత, కుమారి, బాబా, చక్రహరి, రామారావు, సుధాకర్ పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా నాయకులు పెరిక విజరు కుమార్, నల్ల వెంకటయ్య, నల్ల రామస్వామి, బిజిలి లింగయ్య, మండల రాజశేఖర్, మేడి వెంకటయ్య, నాగిళ్ల వెంకటయ్య, జంగయ్య, సతీష్, సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు.
మేడే వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలి
ప్రపంచ కార్మికుల దినోత్సవం పురస్కరించుకొని మే 1వ తేదీ నుండి7 వరకు మే డే వారోత్సవాలను వాడ వాడల ఘనంగా నిర్వహించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ అన్నారు. దేవరకొండ నియోజకవర్గ సీఐటీయూ ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో సోమవారం రమావత్ సర్వన్అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరైన మాట్లాడారు. ఈ సమావేశంలో సీఐటీయూ నాయకులు రమావత్ జబ్బర్, బిజిలి లింగయ్య, ఎల్.లల్లరు, ఎం.జంగయ్య, ఏ. శ్రీను, ఆర్.లచ్చిరమ్, ఎస్. సుగుణమ్మ, ఎన్. శ్రీను, ఎన్. సాయిలు, అర్.రాజు, ఆర్. శంకర్, తదితరులు పాల్గొన్నారు.