Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
మామిడి రైతు ఆదివారం వచ్చిన వడగళ్లవానకు పెనుగాలులకు మామిడికాయలు రాలి మామిడి రైతు పరిస్థితి దారుణంగా తయారైంది. వెనుకారులకు మామిడి చెట్లు కొమ్మలు విరిగి మామిడికాయ దాదాపు రాలిపోయింది. ముఖ్యంగా ఎర్రవరం,గుడిబండ, తొగర్రాయి, కాపుగల్లు, నల్లబండగూడెం గ్రామాలలో మామిడితోటలు అధికంగా ఉన్నాయి.రూ.లక్షలు వెచ్చించి మామిడితోటలను కౌలుకు తీసుకున్న రైతుల పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది.ప్రస్తుతం ఉన్న కాయ చెట్లకు కోట్టిన మందులకు సరిపోవని ఆవేదన వ్యక్తం చేశారు.నడిగూడెం మండలకేంద్రానికి చెందిన హసన్ అనే రైతు కోదాడ మేళ్లచెరువు మండలాలలో సుమారు 40 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. వాటిపై ఇంతవరకు రూ.35 లక్షలు పెట్టుబడి పెట్టాడు.ఇప్పటివరకు వాటిపై సుమారు రూ.4 లక్షల వరకు వచ్చాయి. కాగా ఆదివారం వచ్చిన పెనుగాలులకు తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.అధికారులు స్పందించి మామిడి రైతు కౌలు రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.