Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మర్రిగూడ
కరువు కాటకాలతో అల్లాడుతూ, ఫ్లోరైడ్ రక్కసి కోరల్లో చిక్కుకున్న మునుగోడు నియోజకవర్గ ప్రజలు ప్రాజెక్టల కోసం ఇంకెన్నాళ్ళు వేచిచూడాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం పాలకులను ప్రశ్నించారు.మునుగోడు సమగ్రాభివృద్ధికై ఆ పార్టీ ఆధ్వర్యంలో సాగుతున్న పాదయాత్ర మంగళవారం తమ్మడపల్లి, తిరుగండ్లపల్లి, ఎరగండ్లపల్లి, కొండూరు, మర్రిగూడ మండలం కేంద్రానికి చేరుకున్న సందర్భంగా మాట్లాడారు.మునుగోడు ప్రాంత ప్రజలు, తరాలుగా ఫ్లోరైడ్ పీడితులుగా బతుకుతున్నారని,ఫ్లోరైడ్ నుండి శాశ్వత విముక్తి పొందాలంటే, ప్రాజెక్టుల ద్వారా సాగు నీరు అందించా లన్నారు.మర్రిగూడ మండలంలోని చర్లగూడెం ప్రాజెక్టు పనులు,గత ఎనిమిది సంవత్సరాలుగా నత్తనడకన సాగుతున్నాయని, పదిరోజుల నుండి పనులు పూర్తిగా ఆగిపోయాయని సత్యం విమర్శించారు.ఈ కార్యక్రమంలో పాదయాత్ర బృందం సభ్యులు ఆర్. అంజాచారి, కె. శ్రీనివాస్, బి.గాలయ్య, గురిజ రామచంద్రం, బొలుగూరి నర్సింహా, తీర్పాటి వెంకటేశం, జగన్, ఈదుల భిక్షం రెడ్డి, కళ్ళెం యాదగిరి రెడ్డి, బూడిద సురేష్, ఆకుల రఘుమయ్య, ఎరుకల నిరంజన్ గౌడ్, గిరి, కొమురయ్య , ఏర్పుల సంజీవ, కప్పుల నర్సింహా, జక్కల అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.