Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెద్దవూర
రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు అధికారులను ఆదేశించారు.మంగళవారం మండలంలోని నాయినవానికుంట స్టేజీవద్ద వ్యవసాయ సహకార సంఘం పులిచర్ల ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసి కొనుగోళ్లను పరిశీలించారు.కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని తెలిపారు.మండల వ్యవసాయ అధికారి సందీప్‌రెడ్డితో మాట్లాడి ఏఈ ఓలను కొనుగోలు కేంద్రాల లో అందుబాటులో ఉండి తేమ శాతం రికార్డ్ చేయాలని సూచించారు.హమాలీలు పెంచి లిఫ్టింగ్, లారీలు ఏర్పాటు చేసి కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు రవాణా చేయాలన్నారు.ఏఈ.ఓలు తేమ శాతం సర్టిఫికెట్లో రికార్డ్ చేసి సంతకం పెట్టాలని సూచించారు.సెంటర్ ఇన్చార్జిలు కొనుగోలు చేసేప్పుడు రైతు వద్ద ఆధార్‌కార్డ్,బ్యాంక్ అకౌంట్ పాస్ పుస్తకం,పట్టాదార్ పాస్ పుస్తకంజీరాక్స్ కాపీలు తీసుకోవాలని సూచించారు.లేకుంటే ట్యాబ్ ఎంట్రీ, చెల్లింపులు ఇబ్బంది ఏర్పడి జాప్యం జరుగుతుందన్నారు.రైతులు కోత తర్వాత ఆరబెట్టి తాలు,మట్టి లేని నాణ్యమైన ధాన్యం,17 శాతం తేమ మించకుండా తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.సంబంధిత జిల్లా అధికారులు సూపర్వైజర్ అధికారులు ప్రతి రోజు కొనుగోళ్లు పర్యవేక్షణ చేయాలన్నారు.ఆయన వెంట తహసీల్దార్ సైదులుగౌడ్,సీనియర్ అసిస్టెంట్ దందా శ్రీనివాస్‌రెడ్డి,ఏపీఎం విజయ్‌కుమార్,ఏఈఓలు మహేశ్వరి,సితార,రైతులు వున్నారు.