Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను
నవతెలంగాణ-నిడమనూరు
సమాజంలో రోజురోజుకు పెరిగిపోతున్న అంతరాలు, దోపిడీదారుల కుట్రలకు సబ్బండ కులాలు బలవుతున్నాయని, మూఢనమ్మకాలు అజ్ఞానం వైపు ప్రజలను తీసుకెళ్తున్నారని విజ్ఞానం వైపు మళ్ళించడమే జనజాతర ఉద్దేశమని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను,ఎంపీపీ బొల్లం జయమ్మ, దళిత సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పోలే రవి అన్నారు. మంగళవారం మండలకేంద్రంలో దళిత సామాజిక ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఫూలే,అంబేడ్కర్ జనజాతర కరపత్రాలను విడుదల చేసి మాట్లాడారు.ఈ దేశం అభివృద్ధి జరగాలన్న సమ సమాజం నిర్మాణం జరగాలన్న చదివే ప్రాధాన్యమని ,చదువులోని శాస్త్ర సాంకేతిక విజ్ఞానే ప్రధానం తప్ప మూఢనమ్మకాలు, జ్యోతిష్యాలు కావన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు బొల్లం రవి, నల్లబోతు వెంకటేశ్వర్లు,మేరెడ్డి వెంకటరమణ, లకుమల్ల మధుదాసు,కందుల వెంకటేశ్వర్లు,సామ వెంకటరాములు, మాతంగి ఇద్దయ్య, అల్లంపల్లి నరేష్,ఆదిమల్ల భాస్కర్, పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
నాంపల్లి: ఈనెల 28వ తేదీన జరిగే ఫూలే, అంబేడ్కర్ జాతరకు నాంపల్లి మండలం నుండి వేలాదిమంది తరలి రావాలని ప్రజానాట్యంమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి, కెేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బొట్టు శివకుమార్ పిలుపునిచ్చారు.నాంపల్లి అంబేద్కర్ చౌరస్తాలో జనజాతర కరపత్రాలు సామాజిక ప్రజా, కుల సంఘాలతో కలిపి ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కమిటీసభ్యురాలు గంటెలకలమ్మ, పూలే, అంబేద్కర్ నియోజకవర్గ చైర్మెన్ మలిగె యాదయ్య, అధ్యక్షుడు నారపాక ఆంజనేయులు, బీసీసంఘం నియోజకవర్గ నాయకులు పూల వెంకటయ్య, గంజి సంజీవ, మైనార్టీ సంఘం మండల నాయకులు ఎండి సలీం, అమరవీరుల ఆశయ సాధనసమితి రాష్ట్ర అధ్యక్షుడు కోరె సాయిరాం, దళితసంఘం నాయకులు ఊరుపక్క వెంకటయ్య, కప్పెర వెంకటయ్య ఏదుళ్ళ సునీత, కోరె లలిత, శేఖర్‌రెడ్డి, పేపర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.