Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశం మొత్తం అమలు కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి,మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు.మంగళవారం పట్టణంలోని సాయిరమ్య ఫంక్షన్హాల్లో జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ ప్రతినిధుల సభలో వారు మాట్లాడారు.కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న చట్ట వ్యతిరేకమైన చర్యలకు చరమగీతం పాడాలని కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారన్నారు.కేంద్రహోం మంత్రి హోదాలో ఉండి అమిత్‌షా మొన్న చేవెళ్ల సభలో ముస్లిముల రిజర్వేషన్లు తొలగిస్తామనడం రాజ్యాంగానికి విరుద్ధమన్నారు. ముస్లిములు దేశపౌరులు కారా అని ప్రశ్నించారు.వారిని అభివృద్ధి చేసుకునే బాధ్యత కేంద్రానికి లేదా అని ప్రశ్నించారు.ు దేవరకొండ ఎమ్మెల్యే పనితీరు అద్భుతంగా ఉందని మళ్లీ రవీంద్రకుమార్ విజయం సాధించడం పక్కా అన్నారు.కాంగ్రెస్, బీజేపీ నాయకులకు రాష్ట్ర అభివృపై యావ లేదన్నారు.కేవలం అధికారంలోకి రావాలి ,దోచుకొని తినాలి అనేది వాళ్ల కుట్ర అన్నారు.బీజేపీ జైశ్రీరామ్ పేరుతో ఓట్ల రాజకీయం చేస్తుందన్నారు.ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మెన్ అల్లంపల్లి నర్సింహ,ఎంపీపీలు మాధవరం సునీతజనార్దన్రావు,వంగల ప్రతాప్‌రెడ్డి,నల్లగసు జాన్‌యాదవ్,జెడ్పీటీసీలు మారుపాకుల అరుణసురేష్‌గౌడ్, కంకణాల ప్రవీణావెంకట్ రెడ్డి,కేతవత్ బాలు నాయక్,పసునూరి సరస్వతమ్మ,బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పున్న వెంకటేశ్వర్లు,మండలాల అధ్యక్షులుటీవీఎన్.రెడ్డి, రమావత్ దాస్రు,లోకసాని తిరపతయ్య, దొంతం చంద్రశేఖర్‌రెడ్డి,ముత్యాల సర్వయ్య,వెలుగురి వల్లపు రెడ్డి,రాజినేని వెంకటేశ్వర్ రావు,బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్‌రెడ్డి,హన్మంత్ వెంకటేష్‌గౌడ్, గాజుల ఆంజనేయులు,రైతుబంధు అధ్యక్షులుమండల కేసాని లింగారెడ్డి, ఉజ్జిని విద్యాసాగర్‌రావు,సిరందాసు కృష్ణయ్య,బోయపల్లి శ్రీనివాస్‌గౌడ్,పీఏసీఎస్ చైర్మెన్లు పల్లా ప్రవీణ్,ముక్కమల్ల బాలయ్య, తూంనాగార్జున్రెడ్డి,మాధవరం శ్రీనివాస్‌రావు,వైస్‌ఎంపీపీలు చింతపల్లి సుభాష్,వైస్‌చైర్మెన్ రెహత్అలీ, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజు,ముచ్చర్ల ఏడుకొండలుయాదవ్,మేకల శ్రీనివాస్ యాదవ్,నేనావత్ రాంబాబు నాయక్,పసునూరి యుగేందర్‌రెడ్డి,కుంభం శ్రీనివాస్‌గౌడ్,దొందేటి మల్లా రెడ్డి,మునగాల అంజి,ఏర్పుల గోవింద్ యాదవ్,వాడిత్య దేవేందర్,రేటినేని ముత్యపురావు,బొడ్డుపల్లికృష్ణ,బొడ్డు గోపాల్‌గౌడ్, మాసభాస్కర్, గోరేటిపుల్లమ్మ,రాఘవాచారి, కేతావత్ లక్ష్మణ్ నాయక్,రమావత్ మోహన్‌కృష్ణ, కేతావత్ రవీందర్,నల్లపెద్దయ్య,మునికుంట్ల వెంకట్‌రెడ్డి,విరమోని అంజి గౌడ్,రాములు గౌడ్,తస్కిన్ సుల్తానా పాల్గొన్నారు.