Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతుల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.ఆ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర మంగళవారం గదగుండుతండా, జటావాత్తండా, దీరావత్తండా, కొత్తసామ్యతండా, జప్తివీరప్ప గూడెం, కొత్తూరు గుండా టీక్యాతండాలో కొనసాగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌలు రైతులకు నగదు,రూ.500 గ్యాస్ సిలిండర్, వృద్ధ దంపతులు ఇద్దరికీ పెన్షన్, నిరుద్యోగ భృతి, చదువుకున్న యువతీ యువకులు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు.పార్టీ నుండి పదవులు పొంది, డబ్బులు వెనక వేసుకున్న నాయకులు మాత్రమే పార్టీ ఫిరాయించారని ఎద్దేవా చేశారు.కానీ కార్యకర్తలు మాత్రం పార్టీ కోసం నిలబడ్డారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిలి శ్రీనివాస్, ఎంపీటీసీ రత్నకుమారి చలపతిరావు, మాజీ ఎంపీపీ షేక్ జింద, డీసీసీబీ మాజీ డైరెక్టర్ రవీందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటయ్య, పాండునాయక్, వెంకట్రామ్, కౌసల్య, నారాయణరెడ్డి, దేవిసింగ్నాయక్, పత్యనాయక్, హరిచంద్‌నాయక్, సిద్దునాయక్, నాగునాయక్, చందునాయక్, నాగరాజునాయక్, బాల, కొండనాయక్,వెంకట్రామ్, తులరాంసింగ్, హుస్సేన్,వెంకట్రాములు, రాజు, లతీఫ్, రాములు నాయక్,శ్రీనునాయక్, బాలునాయక్ పాల్గొన్నారు.