Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆల్ హమాలీ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి
నవ తెలంగాణ -నకిరేకల్
ప్రభుత్వ ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు భవన నిర్మాణం తరహాలో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆల్ హమాలీ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం స్థానిక నర్రా రాఘవరెడ్డి భవనంలో ఈనెల 29న సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగే చలో హైదరాబాద్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 29న రాష్ట్ర లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాకు హమాలీ కార్మికులు పెద్ద ఎత్తున కదిలి రావాలన్నారు. హమాలీలకు 50 కేజీలకు మించిన బరువులను నిషేధించాలని, పనిగంటలు, పని భద్రత, గుర్తింపు కార్డులు, కనీస వేతనాలు, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రమాద బీమా, ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న హమాలీలను నాలుగవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని ఐ ఎల్ ఓ తీర్మానం చేసినప్పటికీ ఎక్కువ బరువులు మోయించి కార్మికులను అనారోగ్యానికి గురి చేస్తున్నారన్నారు. పోరాడి సాధించు కున్న 29 కార్మిక చట్టాలను బిజెపి ప్రభుత్వం రద్దు చేయడం దుర్మార్గమన్నారు. అంబానీ, అదాని కార్పొరేట్లకు అనుకూలంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. హమాలీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా చేపడుతున్న ఆందోళనలకు కార్మికులు కదలిరావాలని పిలుపు నిచ్చారు.ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఒంటెపాక వెంకటేశ్వర్లు, ప్రతినిధులు తాడ్వాయి రాములు, బొల్లెపల్లి కృష్ణ, సూరారపు వీరయ్య, మల్సూరు, మామిడి శ్రీను, మేరెడ్డి లింగయ్య, బాతక సైదులు, వెంకన్న పాల్గొన్నారు.
వీఓఏఉద్యోగుల సమ్మెను ఉధృతం చేస్తాం
3 న జరిగే కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయండి
ఐకెపి వి వో ఎ ల సమస్యలను పరిష్కరించకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి హెచ్చరించారు మంగళవారం నకిరేకల్ పట్టణంలో కొనసాగుతున్న వివోఏల నిరవధిక సమ్మె 9వ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా సమ్మెను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ వివో ఏల ఉద్యోగుల వేతనాలు పెంచాలని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం నెలకు రూ. 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మే మూడవ తేదీన కలెక్టరేట్ల ముందు జరిగే మహా ధర్నా, వంటావార్పును జయప్రదం చేయాలని కోరారు. ఈ సమ్మెలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు వంటిపాక వెంకటేశ్వర్లు, తాడువాయి రాములు, వివో ఏ మండల గౌరవ అధ్యక్షుడు గొర్ల యాదగిరి, మండల అధ్యక్షురాలు జెల్ల ఇందిర, ప్రతినిధులు ఎం నిర్మల, అరుణ, రాములమ్మ, రేణుక, బాలకృష్ణ, శ్రీలత, సంధ్య పాల్గొన్నారు.