Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైస్ మిల్లర్లను ఆదేశించిన డీఎస్ఓ
నవతెలంగాణ-మిర్యాలగూడ
ధాన్యం దిగుమతిని వేగవంతం చేయాలని డీఎస్ఓ వెంకటేశ్వర్లు ఆదేశించారు.మంగళవారం పట్టణంలోని మిర్యాలగూడ రైస్ ఇండిస్టీ మండలంలోని తుంగపాడు గౌరు నారాయణ రైస్ మిల్లులను ఆయన సందర్శించి ధాన్యం దిగుమతిపై ఆరా తీశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రైస్ మిల్లు తప్పనిసరిగా 10 లారీలకు తగ్గకుండా ప్రతిరోజు ధాన్యం దిగుమతి చేసుకోవాలని సూచించారు.కెపాసిటీని బట్టి రైస్ మిల్లులు ధాన్యం దిగుమతిని పెంచాలని కోరారు. త్వరతగతిన ప్రొక్యూర్మెంట్ పూర్తి చేయాలని ఆదేశించారు ఇప్పుడు వరకు 1.2 లక్షల మెటిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు.జిల్లా వ్యాప్తంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశామని తెలిపారు.ధాన్యం దిగుమతిలో అలసత్యం వహించవద్దన్నారు.ఆయన వెంట సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ రామకృష్ణారెడ్డి, రైస్ మిల్లర్ రంగా రంజిత్, ఆర్ఐ సురేందర్సింగ్ తదితరులు ఉన్నారు.