Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చింతపల్లి
రైతుల పట్ల అలసత్వం వహించరాదని జాయింట్ కలెక్టర్ భాస్కర్‌రావు హెచ్చరించారు.మంగళవారం చింతపల్లి మండలకేంద్రంలో గల ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద అధికారులు, రైతులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బందులు పెడితే సహించేది లేదన్నారు. రైతులు పండించిన పంటను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చూసేందుకు పీఏసీఎస్ ద్వారా ఐకేపీసెంటర్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించింది కాగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులను అధికారులు కొనుగోలు విషయంలో తేమ,తాలు అని ఇబ్బందులు పెడుతున్నారని రైతులు సోమవారం నాగార్జునసాగర్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.జాయింట్ కలెక్టర్ భాస్కర్‌రావు మంగళవారం మండల కేంద్రంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలుకేంద్రాన్ని అకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడి సమస్యలను గురించి తెలుసుకున్నారు. రైతులు ధాన్యంలో తాళ్లు లేకుండా చూడాలని కొనుగోలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు తరకుండా చూస్తామని రైతులకు హామీ ఇచ్చారు.జాయింట్ కలెక్టర్ నుండి అధికారులకు లారీలు వచ్చేవరకు బస్తాల్లో నింపకుండా ఉంటున్నారని, ముందు సుమారు 2000 నుండి 3000 బస్తాల వరకు కాంటా వేయించుకొని రెడీగా పెట్టుకోవాలని అధికారులను ఆదేశించారు.ప్రతిరోజు తహసీల్దార్ వరి ధాన్యం కొనుగోలుపై నిఘా ఉంచాలని సూచించారు. తహసీల్దార్‌పై, ఏఈఓలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గోపిరామ్, తహసీల్దార్ విశాలాక్ష్మీ, ఏవో రామలింగేశ్వరరావు, ప్రజలు పాల్గొన్నారు.