Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టులో కేసు కొట్టివేత
- ఫలించిన మంత్రి జగదీశ్‌రెడ్డి కృషి
- షురూ కానున్న సుందరికరణ పనులు
- తీరనున్న దశాబ్దాల ట్రాఫిక్ సమస్య
నవతెలంగాణ-సూర్యాపేట
పట్టణంలోని పాత జాతీయ రహదారి పై ఉన్న స్టేను మంగళవారం హైకోర్టు కేసు కొట్టివేయడంతో రహదారి విస్తరణకు లైన్ క్లియర్ అయింది. కొన్ని దశాబ్దాలుగా ప్రజలు ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతున్న విషయం తెల్సిందే.ఈ నేపథ్యంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు గా గెలుస్తున్నారే తప్ప...ఈ రహదారిపై ఉన్న ట్రాఫిక్ సమస్యను మాత్రం పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఎమ్మెల్యే గా గెలిచిన జగదీష్ రెడ్డి పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు నడుం బిగించారు. దశాబ్దాల సమస్య ను పరిష్కరించేందుకు ప్రణాళిక రచించి రహదారి విస్తరణ చేపట్టిన విషయం తెలిసిందే.అందుకు అనుగుణంగా గత జులై 28 వ తేదీ 2019 వ సంవత్సరంలో పాత జాతీయ రహదారి విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే రోడ్డు సుందరీకరణ కోసం విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి 25 కోట్లు ప్రకటించి వెనువెంటనే పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగానే స్థానిక కోర్టు నుండి పూల సెంటర్ మీదుగా ఈశ్వర్ థియేటర్ వరకు రోడ్లు, డ్రైనేజీ, డివైడర్స్, ఫుట్ పాత్, విద్యుదీకరణ సెంట్రల్ లైటింగ్, పార్కింగ్,గ్రీనరి తదితర నిర్మాణాల కోసం నిధుల మంజూరులో మొదటి విడతగా 9.40 కోట్లతో ఈ పనులను ప్రారంభించారు. కాగా కొంతమంది ఆనాడు హైకోర్టును ఆశ్రయించారు.ఈ క్రమంలో కొందరు కోర్టు కు వెళ్లడంతో అభివృద్ధి పనులు నిలిచి పోయిన విషయం తెలిసిందే.దీంతో ఏలాంటి పనులు చేపట్టవద్దని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో మున్సిపల్ అధికారులు మాత్రం హైకోర్టులో స్టే ఉన్న ప్రాంతాలను మినహాయించి మిగతా చోట్ల రోడ్లు, డ్రైనేజీ, డివైడర్ నిర్మిస్తూ పనులను చేస్తు వచ్చారు. మూడు సంవత్సరాలు నుండి కోర్టు వ్యవహారాలతో పనులు నిలిచి పోయాయి. హైకోర్టు లో ఇరువర్గాల మధ్య కొన్ని నెలలుగా వాదోప వాదాలు నడిచాయి.కాగా చివరిగా హైకోర్టు మంగళవారం స్టే ను కొట్టివేయడంతో సూర్యాపేట పట్టణంలో ఇక సుందరికరణ పనులు ముమ్మరంగా జరగనున్నాయి.ఈ నేపథ్యంలో మొదటి నుండి కూడా అభివృద్దే లక్ష్యం గా పట్టువదలని విక్రమార్కుడి గా మంత్రి జగదీష్ రెడ్డి ఈ పాత జాతీయ రహదారిపై సుందరికరణ చేపట్టి ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని చేసిన భగీరథ కృషి ఫలించింది. మంత్రి నిరంతర కృషి... అభివృద్ధి అనే విజన్ తో ముందుకు వెళుతున్న క్రమంలో హైకోర్టు పాత జాతీయ రహదారిపై విస్తరణకు క్లియరెన్స్ ఇవ్వడంతో పట్టణ ప్రజలతో పాటు సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కి రుణపడి ఉంటామని అభివృద్ధి కోసం అండగా ఉంటామని ప్రజలు మంత్రి కి అభినందనలు తెలియజేస్తున్నారు.