Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆత్మకూర్ఎస్
మండలపరిధిలోని ముక్కుడిదేవులపల్లి గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలుకేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ మంగళవారం సూర్యాపేట-దంతాలపల్లి ప్రధాన రహదారిపై రైతులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ముక్కుడుదేవులపల్లి గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో రెండు రోజులుగా కురిసిన వర్షాలకు ధాన్యం తడిసి ముద్దైందన్నారు.ు. ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసేంతవరకు రాస్తారోకోను విరమించమంటూ రెండు గంటలపాటు రాస్తారోకో చేయడంతో భారీగా ట్రాఫిక్ అంతరాయం కలిగింది. రెండు కిలోమీటర్ల వరకు వాహనాలు బారులు తీరాయి.తహసీల్దార్ పుష్ప, ఎస్సై యాదవేందర్రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడి హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.ఈ కార్యక్రమంలో ఎస్కె.ఫయాజ్, పెద్దింటినవీన్, ఇరుగులచ్చయ్య, మధుకర్, ముల్లపాక అంజయ్య, కృష్ణయ్య, దాసరిమధుకర్, భయ్యారవి, రాఘవేంద్రరెడ్డి, సురేష్, భయ్యా లింగయ్య, గంగయ్య, గంగమల్లు తదితరులు పాల్గొన్నారు.