Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోమటిరెడ్డి సోదరులు కోవర్టు రెడ్డిలు
- ప్రజా ప్రతినిధుల ప్లీనరీలో మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
నవతెలంగాణ -నల్లగొండ
తెలంగాణా అభివృద్ధికి కేంద్రం మోకాలడ్డు వేస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. భారతదేశం గర్వించే రీతిలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబెద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పడం జాతి గర్వించదగ్గ అంశమని ఆయన పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ నల్లగొండ నియోజకవర్గ ప్రజా ప్రతినిధుల ప్లీనరీ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అంతకుముందు ప్లీనరీ ఎదుట పార్టీ జెండా ఆవిష్కరించి, తెలంగాణ తల్లి చిత్రపటానికి, అమరవీరుల స్థూపానికి పూల మాలలు వేసి ప్లీనరీ ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో శ్రీహరి మాట్లాడుతూ వర్తమానానినికి స్ఫూర్తిదాయకంగా నిలిచే రీతిలో 125 అడుగుల బాబాసాహెబ్ అంబెడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు సచివాలయానికి అంబెద్కర్ పేరును పెట్టడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును ప్రకటిస్తారా అని బీజేపీ నాయకులకు సవాల్ విసిరారు. జిల్లాలో బడా నాయకులమని చెప్పుకుంటున్న కోమటిరెడ్డి సోదరులు కోవర్టు రెడ్డిలుగా మారి రాజకీయంగా దిగజారిపోతున్నారని విమర్శించారు. చరిత్రలో నిలిచి పోయే విదంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి మానవ అద్భుతమైన ప్రాజెక్ట్ ను ఆవిష్కరించిన ఇంజినీర్ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన అభినందించారు. బడుగుల సంక్షేమానికి భరోసా అందించడమే కాకుండా వారిని సుసంపన్నం చేసేందుకు చేపట్టిన పథకాలు అద్భుతమైన ఫలితాలు అందిస్తున్నామన్నారు.నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడుతూ గెలిచిన నాలుగు సంవత్సరాల కాలం 1200 కోట్లతో నియోజకవర్గాన్ని అభివద్ధి పదంలో నడిపించానని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తను కంటి రెప్పల కాపాడుకుంటానని అన్నారు. ఈ సందర్భంగా 9 తీర్మానాలను ఆమోదించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్ గౌడ్, సీనియర్ నాయకులు పంకజ్ యాదవ్, నల్లగొండ, తిప్పర్తి, కనగల్, మండల అధ్యక్షులు దేప వెంకటరెడ్డి, పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, అయిత గొని యాదయ్య గౌడ్, కనగల్ జడ్పిటిసి చిట్ల వెంకటేశం, ఎంపీపీ కరీం పాషా, తిప్పర్తి ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.