Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ- నల్లగొండ
ప్రపంచ కార్మికుల దినోత్సవం పురస్కరించుకొని మే 1వ తేదీ నుండి7 వరకు మే డే వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమరయ్య భవన్లో ఆ సంఘం పట్టణ మేడే సన్నాహక సమావేశం జిల్లా కమిటీ సభ్యులు సాగర్ల యాదయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కుల మతాలకతీతంగా నిర్వహించుకునే ఏకైక పోరాట దినం మేడేను కార్మికులందరూ ఐక్యంగా ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. 1886లో అమెరికాలోని చికాగో నగరంలో 8గంటల పని విధానం కొరకు పరిశ్రమ యజమానులకు కార్మికులకు మధ్య జరిగిన పోరాటంలో అనేక మంది కార్మికులు ప్రాణాలు వదిలారని,వారి రక్తంలో తడిసిన జెండా ఎర్ర జెండా కార్మికుల పక్షాన, వారి హక్కుల పరిరక్షణ కోసం అనేక ఉద్యమాలు సాగిస్తూ నేడు 138వ కార్మిక దినోత్సవం జరుపుకోవడానికి సన్నద్ధమైందని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం దేశంలో మేడే విశిష్టతను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తుందన్నారు విశ్వకర్మ జయంతిని కార్మిక దినోత్సవం గా జరుపుకోవాలని కుటిల ప్రయత్నం చేస్తుందని ఇటువంటి దుర్మార్గమైన చర్యలను కార్మిక వర్గం ముక్త కంఠంతో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎండి.సలీమ్ మాట్లాడుతూ మేడే వారోత్సవాలలో భాగంగా మే 1న నలగొండ పట్టణంలో భారీ బైక్ ర్యాలీ, రెండు నుండి ఏడు వరకు వివిధ వార్డులలో సాంస్కృతిక కార్యక్రమాలు, ముగ్గుల పోటీలు ,ఆటపాట మాట కార్యక్రమాలు నిర్వహించి మే 7న మేడే వారోత్సవాల ముగింపు సభ నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఆ సంఘంపట్టణ కన్వీనర్ దండెంపల్లి సత్తయ్య, హమాలీ భవన నిర్మాణం మున్సిపల్ పవర్ లూమ్ ట్రాన్స్పోర్ట్ వివిధ యూనియన్ల అధ్యక్ష కార్యదర్శులు సలివొజు సైదాచారి, నకెరకంటి సుందరయ్య, గంజి నాగరాజు, కత్తుల యాదయ్య ,ఆవురేష్ మారయ్య, నిరసనమెట్ల వెంకన్న, దొండ శ్రీశైలం, సాగర్ల మల్లయ్య ,దొమ్మాటి యాదగిరి, బచ్చలకూరి గురువయ్య, పాక లింగయ్య, మన్నె శంకర్, కావేరి నరసింహ, పేర్ల సంజీవ ,పందుల లింగయ్య ,తెలుసూరి లక్ష్మమ్మ, మూడా చంద్రకళ ,ఎస్కే జానీ సావిత్రమ్మ,అంజయ్య,రామచంద్రమ్, తదితరులు పాల్గొన్నారు.