Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -వలిగొండరూరల్
వలిగొండ-సుంకిశాల మధ్య అధ్వానంగా మారి ప్రజలను తీవ్రంగా ఇబ్బందులు గురిచేస్తున్న బీటీ రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సిర్పంగి స్వామి,మండల కమిటీ సభ్యులు కొండే కిష్టయ్య డిమాండ్ చేశారు. మంగళవారం సుంకిశాల గ్రామంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపి మాట్లాడారు. మూడు సంవత్సరాలుగా రోడ్డు పూర్తిగా ధ్వంసమై ఈ రోడ్డు గుండా ప్రయాణం చేస్తున్న సుంకిశాల, పులిగిల్ల గ్రామ ప్రజలతో పాటు మోటకొండూరు,భువనగిరి మండలాలకు వెళ్లే ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనాఅధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు పనులు చేయించాలని డిమాండ్ చేశారు. మే 4 వ తేది వరకు పనులు ప్రారంభించకపోతే సుంకిశాల, పులిగిల్ల గ్రామాల ప్రజలతో పాటు, కార్యకర్తలను సమీకరించి రోడ్డు దిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీశాఖ సహాయ కార్యదర్శి మంగ బాలయ్య, నాయకులు ఎడవెల్లి రాములు,కాటేపల్లి పాండు, చెరుకు స్వామి,వేముల రాములు,కాటపల్లి వెంకటేశం,బొదాసు సోమయ్య,ఏనుగు ప్రభాకర్ రెడ్డి, గాడిపల్లి రమేష్,దొడ్డి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.