Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరురూరల్
ఆలేరు ప్రజల వైద్య అవసరాలను తీర్చే విధంగా 100 పడకల ఆసుపత్రిని నిర్మించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దుపటి వెంకటేష్ అన్నారు. మంగళవారం మండలంలోని శర్బనాపురం గ్రామంలో రాజకీయ శిక్షణా తరగతుల పోస్టర్ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. మండలంలోని గ్రామాలకు వెళ్లే దారిలో బ్రిడ్జిల నిర్మాణం చేయకపోవడం వల్లమండలంలోని గ్రామాలలో వర్షాకాలంలో వాగులు రోడ్డుపై నుండి పారి రాకపోకలకు అంతరాయం ఏర్పడి రోడ్డు సంబంధాలు తెగిపోతున్నాయన్నారు వీటి పరిష్కారం కోసం అనేక ఆందోళనలు పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో అన్నదమ్ములాగా జీవిస్తున్న వారి మధ్య మత, కుల వైశ్యామ్యాలను పెంపొందిస్తుందన్నారు. ఈనెల 27, 28 తేదీలలో పట్టణంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యవర్గ సభ్యులు సుధ గాని సత్య రాజయ్య, బుగ్గ నవీన్ ,మాజీ గ్రామ శాఖ కార్యదర్శి కారే రాజు, నాయకులు అంగడి నాగేష్ తదితరులు పాల్గొన్నారు.