Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా అధ్యక్షులు దాసరి పాండు
నవతెలంగాణ -భువనగిరిరూరల్
హమలి కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఈనెల 29వ తేదీన హైదరాబాదులోని లోని కమిషనర్ ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూజిల్లా అధ్యక్షులు దాసరి పాండు కోరారు. మంగళవారం రోజున భువనగిరి మండలంలోని చందుపట్ల, కునూరు, ముస్త్యాల పల్లి గ్రామాల్లో హమలి కార్మికులను కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలాది మంది సివిల్ సప్లై, ఎఫ్సీఐ , మార్కెట్ యార్డ్, రైస్ మిల్లు , బజార్ హమాలి, మార్కెట్ హమాలీలుగా ఏళ్ల తరబడిగా పనిచేస్తున్నారని, హమలి కార్మికులు నిత్యం బరువులు మోయడం వల్ల శరీరం బండ పారిపోతుందన్నారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, చట్టాల అమలు చేయాలని జరిగే ధర్నాలు హమాలి కార్మికులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.ఈ కార్యక్రమంలో హమాలి వర్కర్స్ యూనియన్ నాయకులు జానీ, బాల నరసింహ, మల్లయ్య, మల్లేశా, కొమురయ్య, ఎల్లేష్, పరమేష్, చిన్న కోటేష్ పాల్గొన్నారు.
ఆలేరుటౌన్ : లేబర్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఈనెల 29వ తేదీన నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ మండల కేంద్రంలో రైల్వే గేట్ ఆవరణలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు దాసరి పాండు , జిల్లా నాయకులు మొరిగాడి రమేష్ ఆధ్వర్యంలో వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డికొండ నర్సయ్య,గుజ్జ ఎల్లయ్య,క్రిష్ణ, శ్రీకాంత్, జూకంటి సిద్దులు,వీరామల్లు,రమేష్,గోపాల్ జగన్,అంగీరేఖుల సత్యనారాయణ,పోతారం నర్సహ్మ,ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి.
భువనగిరి : అంగనవాడి టీచర్స్ హెల్పర్స్ అండ్ వర్కర్స్ కు గ్రాడ్యుటి అమలు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు దాసరి పాండు అన్నారు.మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో భువనగిరిలోని అంగన్వాడి ప్రాజెక్టు ఆఫీసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోరుతూ సూపర్వైజర్ కు వినతిపత్రం అందజేశారు . ఈ సందర్భంగా దాసరి పాండు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అంగన్వాడి ఉద్యోగులకు గ్రా డ్యూటీ యొక్క అర్హత సమస్యల పైన గత సంవత్సరం క్రితం సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును ప్రకటించిందన్నారు. ఈ కార్యక్రమంలో కరుణ, రుక్మిణి, హేమలత, పద్మ, జయమ్మ, రేణుకా, సాధన, పుష్ప, బాలమణి, వరమ్మ పాల్గొన్నారు.