Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమీకృత విద్యుత్ సర్కిల్ కార్యాలయ భవనం మంజూరు
- ఒకే చోట సర్కిల్,డివిజన్,సబ్ డివిజన్, ఈ ఆర్ ఓ కార్యాలయాలు
- రూ.7కోట్లా 15 లక్షల మంజూరు
- జమ్మిగడ్డ 33/11 కేవీ ప్రాంగణంలో ఏర్పాటు,
- 30 న శంకుస్థాపన
- జిల్లా అభివృద్ధిపై విద్యుత్ శాఖమంత్రి జగదీశ్‌రెడ్డి మార్క్.
నవతెలంగాణ-సూర్యాపేట
సూర్యపేట సిగలో మరో మణిహారం మెరవనుంది.సమీకృత విద్యుత్ సర్కిల్ కార్యాలయం మంజూరు అయ్యింది.ఈ మేరకు టీఎస్ఎస్పీడీసీఎల్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.ఒకే చోట సర్కిల్ (ఎస్ఈ) కార్యాలయం, డివిజనల్ ఇంజినీర్ కార్యాలయంతో పాటు సబ్ డివిజనల్ ఇంజినీర్ కార్యాలయం,ఈఆర్ఓ కార్యాలయం భవనాలు నిర్మించేందుకు గాను రూ.7కోట్లా 15 లక్షలా 61 వేల 885 రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. విద్యుత్ వినియోగ దారులకు అనువుగా ఒకే చోట విద్యుత్ కార్యాలయాలు ఉండే విదంగా మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపి మంజూరు చేయించారు.జిల్లా అభివృద్ధిపై మరోసారి తనదైన ముద్ర వేసుకున్నారు.ఒకే పని మీద విద్యుత్ కార్యాలయాల చుట్టూ తిరిగి కాలయాపన చేసుకోకుండా ఉండేందుకు చేసిన ఈ ఏర్పాటు పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డ 33/11 కేవీ సబ్ స్టేషన్ ప్రాంగణంలో ఈ సమీకృత కార్యాలయ భవనాలు నిర్మించ నున్నారు.ఈ మేరకు ఈ నెల 30 న భవన నిర్మాణ పనుల శంకుస్థాపనను మంత్రి జగదీష్ రెడ్డి చేతుల మీదుగా జరిపించేందుకు విద్యుత్ శాఖాధికారులు నిర్ణయించారు.కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు జిల్లాగా రూపాంతరం చెందిన సూర్యపేటలో ఇప్పటికే మెడికల్ కళాశాల,సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనాలు,యస్ పి కార్యలయం,ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తో ప్రగతి వైపు పరుగులు పెడుతున్న విషయం తెల్సిందే.ఈ క్రమంలో జిల్లా కేంద్రంలో విద్యుత్ స్టోర్స్ ను మంజూరు చేయించడంతో మారుమూల రైతాంగానికి పని సులువుగా మారనున్నది.దానికి తోడు ఏకంగా జిల్లా కేంద్రంలో సమీకృత విద్యుత్ శాఖా కార్యాలబయాల భవనాలు నిర్మించడతో ఇకపై విద్యుత్ వినియోగ దారులకు పనులు సులభతరమవుతాయి.