Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -చివ్వేంల
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ ధరావత్ కుమారి బాబు నాయక్, తహసీల్దార్ రంగారావు అన్నారు. గురువారం అక్కలదేవిగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతులు అధైర్య పడకుండా ఉండాలని ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ లక్ష్మి, ఏపీఎం రాంబాబు, ఎం ఎస్ అధ్యక్షురాలు జయలక్ష్మి, వార్డు మెంబర్లు ఎలమంద, నాగరాజు, విజరు, యలయ్య, పుట్టవెంకటేశ్వర్లు , లోడే వెంకన్న, కోటేష్ , గురువయ్య, సైదులు, నాగయ్య,వీబీకే ఝాన్సీ, సైదమ్మ, జయమ్మ, సునీత తదితరులు పాల్గొన్నారు.