Authorization
Mon April 28, 2025 04:51:06 pm
- మున్సిపల్ కమిషనర్ కెేవీ.రమణ చారి
నవతెలంగాణ-నల్లగొండ
నల్లగొండ పట్టణం వార్డ్ నెంబర్ 14 చర్ల పల్లిలో నెలకొని ఉన్న సమస్యలను త్వరలోనే పరిష్కారం చేస్తామని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కేవీ.రమణచారి తెలిపారు. వార్డ్ వాచ్ కార్యక్రమంలో భాగంగా గురువారం మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ సిబ్బందితో కలిసి నల్లగొండ పట్టణంలోని 14వ వార్డు చర్ల పెళ్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను త్వరలోనే పరిష్కారం చేస్తామని తెలిపారు. చర్లపల్లిలో రెండు రోడ్ల నిర్మాణానికి సంబంధించి గత రెండు సంవత్సరాల క్రితం అప్రూవల్ వచ్చిన టెండర్లు వేయటానికి ఎవరు రావడం లేదని కమిషనర్ దృష్టికి తీసుకురాగా త్వరలోనే టెండర్లను వేసి రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం 35 వ వార్డు రాఘవేంద్ర కాలనీలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్లు బొజ్జ శంకరయ్య, గుర్రం ధనలక్ష్మి, డీఈ అశోక్, ఏఈ దిలీప్, ఎస్ఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.