Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
భువనగిరి మున్సిపల్ పరిధిలోని సింగన్నగూడెం 9వ వార్డులో ఏర్పాటు చేసిన పబ్లిక్రీడింగ్ రూమ్‌ను గురువారం కలెక్టర్ సత్పతి పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ దీపక్‌తివారి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ రీడింగ్ రూమ్‌ను ఇక్కడ ఉన్న అన్ని వయసుల వారికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దినట్టు తెలిపారు.అదనపు కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ జిల్లాలో నిరుపయోగంగా ఉన్నటువంటి భవనాలలో రీడింగ్ రూములను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ సుమా వెంకటేష్, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి , జిల్లా విద్యాశాఖ అధికారి ప్రశాంత్ రెడ్డి, లైబ్రరీ సెక్రటరీ సుధీర్ నవ భారత్ యూత్ కరుణ్, సింగన్నగూడెం గ్రామ ప్రజలు విద్యార్థులు పాల్గొన్నారు.