Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తడిసిన ధాన్యాన్ని మద్ధతు ధరకు కొనుగోలు చేయాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ-చౌటుప్పల్
అకాల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వేగవంతం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ అన్నారు. గురువారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో సీపీఐ(ఎం) మండల జనరల్‌బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ నెల 29,30 తేదీల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సందర్శించనున్నట్టు తెలిపారు. తడిసిన ధాన్యాన్ని షరతులు లేకుండా ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని, నష్టపోయిన వరిపంటకు, తోటలకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. గ్రేడ్ 1, గ్రేడ్ 2 పేరుతో రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే బిల్లులు అందించాలని తెలిపారు. అధికార యంత్రాంగం కదిలి రైతులు ఇబ్బందులు పడకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. తడిసిన ధాన్యాన్ని మద్ధతు ధరకు కొనుగోలు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ మండలకార్యదర్శి గంగదేవి సైదులు, జిల్లాకమిటీ సభ్యులు బూర్గు కృష్ణారెడ్డి, నాయకులు రాగీరు కిష్టయ్య, తడక మోహన్, చీరిక సంజీవరెడ్డి, పల్లె మధుకృష్ణ, అంతటి అశోక్, ఎంపీటీసీ చెన్నబోయిన వెంకటేశం, చింతల సుదర్శన్, బోదాసు వెంకటేశం, కొండె శ్రీశైలం, చీరిక అలివేలు, బాలరాజు, ఇట్టగోని శేఖర్ పాల్గొన్నారు.