Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ -హుజూర్ నగర్
పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో వెంక రెడ్డి అధ్యక్షతన గురువారం వివిధ రాజకీయపక్షాల నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతివారం రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి రాబోయే ఎన్నికల్లో జరుగుతున్న మార్పులను చేర్పులను వివరించి వారికి అవగాహన పెంచుతామన్నారు ఎన్నికల జాబితాను సరిచూసుకోవాలన్నారు అన్ని రాజకీయ పక్షాల వారు అందరూ బూతు లెవల్ ఏజెంట్లను నియమించుకోవాలని తెలియజేశారు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే నివృత్తి చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ తహసిల్దార్ జయశ్రీ డిటి కమలాకర్ వివిధ రాజకీయ పార్టీల నాయకులు కస్తాల శ్రావణ్ కుమార్ గోపి మహేష్ బాలకృష్ణ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బోధన బోయిన హుస్సేన్ సిపిఐ పార్టీ నాయకులు ఎల్లావుల రాములు జనసేన నాయకులు హాసన్మీయా సైదులు పాల్గొన్నారు.