Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెన్ పహాడ్
మండల కేంద్రంలోని రైతు వేదికలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో మొదటి వ్యవసాయ న్యాయ సలహా కేంధ్రాన్ని జిల్లా జడ్జి గౌతంప్రసాద్ గురువారం ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడుతూ భూసమస్యలు, విత్తనం నాటినప్పటి నుండి పంట కోసే వరకు వచ్చే ప్రతి సమస్య పరిష్కారం కొరకు పారా లీగల్ వాలంటీర్ల ద్వారా సలహా కేంద్రంలో ఉచితంగా న్యాయ సూచనలు ఇవ్వబడుతాయని తెలిపారు. వ్యవసాయ న్యాయ సలహా కేంద్రాన్ని రైతులు అందరూ వినియోగించుకోవాలని కోరారు. ఇక్కడ పరిష్కారం కానీ విషయాల కొరకు జిల్లా న్యాయ సేవా సంస్థను సంప్రదించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్జి శ్రీవాణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్, ప్రధాన కార్యదర్శి నర్సయ్య యాదవ్, చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ సత్యనారాయణ పిల్లే, డిఎఓ రామారావు నాయక్, తహసిల్దార్ శేషగిరిరావు, ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్, ఏఓ కృష్ణ సందీప్, ఏఈఓ సంధ్య, లీగల్ వాలంటీర్లు రామచంద్రారెడ్డి, సోమన్న, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.