Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం( జిల్లాకార్యదర్శి వర్గసభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు
నవతెలంగాణ-తిరుమలగిరి
ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా మే 1 నుండి7 వరకు వాడవాడలా మేడే ని ఘనంగా నిర్వహించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక తిరుమలగిరి పట్టణ కేంద్రంలో జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1886వ సంవత్సరంలో 18 గంటల పని విధానానికి వ్యతిరేకంగా 8 గంటల పని దినాలు కావాలని నాడు అమెరికాలోని చికాగో నగరంలో యాజమాన్యానికి వ్యతిరేకంగా సమ్మె చేసి రక్తం చిందించి కార్మికులు ఐక్యంగా పోరాడి ప్రాణా త్యాగం చేసి 8 గంటల పని విధానాన్ని సాధించుకోవడం జరిగిందన్నారు. నాటి చికాగో అమరవీరుల స్ఫూర్తితో నేడు దేశంలో బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన 12 గంటల పని విధానానికి వ్యతిరేకంగా కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్ రద్దు అయ్యేంతవరకు అలుపెరుగని పోరాటాలకు కార్మిక వర్గం సిద్ధం కావాలన్నారు. పార్టీకి సంబంధం ఉన్న అన్ని గ్రామాలలో, ఆవాసాలలో పట్టణంలోని అన్ని వార్డులలో మే డే సందర్భంగా పార్టీ జెండాలను ఎగరవేయాలని కోరారు. మేడే ప్రాధాన్యతను వివరిస్తూ అన్ని గ్రామాలలో పార్టీ జనరల్ బాడీ సమావేశాలను నిర్వహించి కార్మికులను, పార్టీ కార్యకర్తలను మేడే సన్న హకానికి సిద్ధం చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గుమ్మడవెల్లి ఉప్పలయ్య, మండల కమిటీ సభ్యులు రాయిల రాజ్ కుమార్, మిట్టపల్లి లక్ష్మి, నిర్మల యాకయ్య, తదితరులు పాల్గొన్నారు.
పెన్పహాడ్ : చికాగో నగర అమర వీరుల స్ఫూర్తి తో మోదీ కార్మిక వ్యతిరేక విధానాలపై వాడవాడలా మేడే వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు రణపంగ కృష్ణ పిలుపునిచ్చారు.మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన భవన నిర్మాణ కార్మికుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ మేడే వారోత్సవాలలో ప్రతి కార్మిక సంఘ సభ్యులు సిఐటీయూ జెండాలు ఎగురవేయాలని విజ్ఞప్తి చేశారు. 8 గంటల పనిరోజుల కోసం సాగిన మహత్తర పోరాటంలో అమరులైన కార్మిక నాయకుల పోరాటాన్ని విస్మరించి నేడు దేశంలో మోదీ ప్రభుత్వం కార్మికులను తిరిగి 200 సవంత్సరాల నాటి పరిస్థితికి తీసుకొనివచ్చి 12 గంటలు పని తీసుక వస్తున్నారని విమర్శించారు. లేబర్ కోడ్లు తేచ్చి పోరాడి సాధించుకున్న కనీసం వేతన చట్టం, పనిభద్రత చట్టం పిఎఫ్, ఈఎస్ఐ లాంటి చట్టాలు లేకుండా చేస్తున్నారని విమర్శించారు. మనుషుల మధ్య మతం పేరుతో చిచ్చుపెట్టీ ఐక్యతను దెబ్బ తీసుస్తున్నారని, రానున్న కాలంలో ఐక్య పొరటాలు ద్వారానే చట్టాలు కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కార్మిక వ్యతరేక పార్టీలు కూడా మేడేలు చెయడం సిగ్గు చేటన్నారు. కార్మికులను మోసం చెసే సంఘాల పట్ల కార్మికులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మండలంలోని అన్ని గ్రామాల్లో వాడవాడనా మేడే సందర్భంగా వారం రోజుల పాటు ఆట, పాట, కవి సమ్మేళనలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు షేక్ భాష, వలపట్ల కృష్ణ, పొంగుల యాదగిరి, మామిడి హుస్సేన్, గణేష్, వెంకటమ్మ, లక్ష్మమ్మ, తదితరులు పాల్గొన్నారు.
పాలకీడు : పాలకీడు మండలంలో మేడే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని సీపీఐ(ఎం) పార్టీ మండల కమిటీ స్పష్టం చేసింది. గురువారం పి ఏ సి ఎస్ వైస్ చైర్మన్ పగడాల మట్టేష్ అధ్యక్షతన పార్టీ మండల కమిటీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ఆ పార్టీ మండల కార్యదర్శి కందగట్ల అనంత ప్రకాష్ మాట్లాడుతూ, మే ఒకటో తేదీన పాలకవీడు మండల కేంద్రంలో పెద్ద ఎత్తున మేడే ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల నుండి సిపిఎం నాయకులు,కార్యకర్తలు, అభిమానులు సంఘటిత,అసంఘటితరంగ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ప్రతి గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మే ఏడో తారీఖు వరకు మేడే వారోత్సవాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో సిపిఎం పార్టీ మండల నాయకులు మాతంగి ఏసురత్నం, ఆర్లపూడి వీరభద్రం, దిద్దకుంట పురుషోత్తం రెడ్డి,మల్లారెడ్డి,పాలకవీడు శాఖ కార్యదర్శి కొండ పెద్ద ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
కోదాడరూరల్ : మే డే ను విజయవంతం చేయాలి అని తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాతాకుల మధుబాబు అన్నారు. గురువారం పట్టణంలోని పాత ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్(బి ఆర్ ఎస్ అనుబంధ సంస్థ) భారత రాష్ట్ర సమితి కార్మిక విభాగం(బి.ఆర్.టి.యు) ఆధ్వర్యంలో నిర్వహించబోయే మేడే వేడుకలకు అన్ని రంగాల్లో పనిచేస్తున్న ట్రేడ్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శుల తో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మేడే వేడుకలను అన్ని రంగాల కార్మిక సంఘాలు పాల్గొనిి విజయవంతం చేయాలని, కేంద్ర ప్రభుత్వం అనేక కార్మిక వ్యతిరేక చట్టాలను తెస్తూ అనేక సంస్థలను ప్రైవేటుపరం చేస్తుందని అటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని అన్నారు.ఈ కార్యక్రమంలో నయీమ్, గ్రామీణ వైద్యుల యూనియన్, మెడికల్ పబ్లిక్ హెల్త్ యూనియన్ ల నాయకులు శేషు, వెంకటేశ్వర్లు అబ్దుల్ భూతం శీను, కాంతారావు, విజయ్, అబ్దుల్ ,విజయలక్ష్మి, అరుణ, కళమ్మ, శైలజ, వరమ్మ, ఇతర నాయకులు పాల్గొన్నారు.