Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్.రాములు
నవ తెలంగాణ-సూర్యాపేట
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కుటుంబ సంక్షేమ నిధిలో టీఎస్‌యూటీఎఫ్ సభ్యులు తప్పక చేరాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్.రాములు ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.గురువారం స్థానిక కార్యాలయంలో కుటుంబ సంక్షేమ నిధి విధి విధానాలపై జరిగిన డివిజన్ సమావేశంలో ఆయన మాట్లాడారు.నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని, నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తొలగించిన పాఠ్యాంశాలను చేర్చాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.డీఏ బకాయిలు,పీఆర్సీ బకాయిలు , పెండింగ్ బిల్లులను చెల్లించాలని పేర్కొన్నారు. పాఠశాలల్లో నైట్ వాచ్ మెన్ ను నియమించాలని కోరారు. పెంచిన మధ్యాహ్న భోజన రేట్లను అమలు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో కోశాధికారి జి వెంకటయ్య, జిల్లా కార్యదర్శులు ఎస్కే సయ్యద్ బి ఆడం, వెలుగు రమేష్,వి.ఓ.టి.టి కన్వీనర్ డి.లాలు , సోషల్ మీడియా కన్వీనర్ డి శ్రీనివాసా చారి, సాంస్కృతిక కమిటీ కన్వీనర్ బి ఆనంద్, మండల బాధ్యులు ఎన్. సైదా, బండ్ల రమేష్, ఏలే సీనయ్య, డి.బాలాజీ, ఉదయ భాస్కర్, జమాలుద్దీన్ ,ఆంజనేయులు, జి నర్సయ్య, ఎస్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.