Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ ఎస్ .వెంకట్రావు
నవతెలంగాణ -సూర్యాపేటకలెక్టరేట్
ఓటు హక్కు పై ప్రజలను చైతన్యపరిచి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు తెలిపారు. ఓటరు జాబితాలో చేపట్టే మార్పులు చేర్పులు నిరంతరంగా చేపట్టే ప్రక్రియ అని కలెక్టర్ స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్ నందు రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు జిల్లా అదనపు కలెక్టర్ ఎస్ మోహన్ రావు తో కలిసి మాట్లాడుతూ ఓటరు జాబితా మార్పుల ప్రక్రియలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సహకరించాలని సూచించారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి ఎఆర్వోలు రాజకీయ పార్టీల నుండి వచ్చే ఫిర్యాదులపై ప్రతివారం పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో బూతుల ఏజెంట్లను నియమించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఓటరు జాబితాలో చనిపోయిన వారిని తొలగించుట కొరకు బిఎల్వోలు విచారించిన అనంతరం తొలగించాలని, ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఓటర్లు ఫార్మ్ 8 ద్వారా నమోదు చేసుకోవాలని, బిఎల్వోలు ఓటర్లకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రతి మీటింగ్ ఆహ్వానించాలని అధికారులకు ఆదేశించారు. అర్బన్ ప్రాంతంలో 1500 ఓటర్లు, రూరల్ ప్రాంతంలో 1200 ఓటర్లు కంటే ఎక్కువ ఉన్న పోలింగ్ బూతులను గుర్తించి ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం అదనపు పోలింగ్ బూతుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఓటరు జాబితాను అధికారులతో పాటు రాజకీయ పార్టీల ప్రతినిధులు పరిశీలించి ఏమైనా మార్పులు ఉన్నట్లయితే తెలియజేయాలన్నారు.ఈవీఎంలను పరిశీలించినప్పుడు గుర్తింపు ఉన్న అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని, అందరూ తప్పక హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు రాజేంద్రకుమార్ ,వెంకారెడ్డి, కిషోర్ కుమార్ ఎన్నికల విభాగధికారి పద్మారావు, బీఆర్ఎస్ నుండి సవరాల సత్యనారాయణ, నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుండి చకిలం రాజేశ్వరరావు, బీజేపీ నుండి అబీద్, సీపీఐ(ఎం) నుండి కోట గోపి, సీపీఐ నుండి దంతాల రాంబాబు ,తదితర పార్టీల నుండి ప్రజా ప్రతినిధులు,సిబ్బంది పాల్గొన్నారు.