Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరుద్యోగ నిరసన ర్యాలీ సక్సెస్
- రేవంత్ రెడ్డికి జన నీరాజనం
- పాదయాత్రలో అభివాదం చేస్తూ ముందుకు
- మీటింగ్కు తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు
నవతెలంగాణ -నల్లగొండ
కాంగ్రెస్లో జోష్ కనిపిస్తోంది. ఆ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన నిరుద్యోగ నిరసన ర్యాలీ సక్సెస్ అయింది. ర్యాలీలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేపట్టిన పాదయాత్రకు జనం నుంచి స్పందన కని పించింది. వారికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. గడియారం సెంటర్లో నిర్వహించిన మీటింగ్ ప్రాంతం జనంతో కిక్కిరిసి పోయింది. రాత్రి 8 గంటల సమయంలో రేవంత్ చేరుకున్నారు. మర్రిగూడ బైపాస్ వద్ద ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత మర్రిగూడ బైపాస్ నుంచి పాదయాత్ర నిర్వహించారు.
నేతల్లో ఉత్సాహం..
నిరుద్యోగ నిరసన ర్యాలీ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం కనిపిస్తుంది. డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ ఈ కార్యక్రమ నిర్వహణ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లాలోని సూర్యాపేట, నకరేకల్, నాగార్జునసాగర్, దేవరకొండ, నల్లగొండ, భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, హుజూర్నగర్, కోదాడ ,మిర్యాలగూడ, మునుగోడు నియోజకవర్గ నేతలు చారులత, భరత్ చౌహాన్ తదితరులు జనసమీకరణకు పాటుపడ్డారు.
గడియారం చౌరస్తా లో తండు సైదులు గౌడ్ రాస్తారోకో. . .
కోమటిరెడ్డి అనుచరులు తమ ఫ్లెక్సీలు చించారని అందోళన..
నిరుద్యోగ నిరసన ర్యాలీకి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు తండు సైదులు గౌడ్ స్వాగతం తెలుపుతూ ప్లెక్సీలు ఏర్పాటు చేయడంతో నాఎదుగుదలను జీర్ణించుకోలేని కోమటిరెడ్డి తన అనుచరులతో ఫ్లెక్సీలను తొలగించారని ఆ దుండగులను తక్షణమే అరెస్టు చేయాలని తండు సైదులు గౌడ్ నల్గొండ జిల్లా కేంద్రంలో గడియారం సెంటర్లో రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టారు.