Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
మోడల్ ఎంసెట్ పరీక్షలు విద్యార్థుల సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి సూచించారు. ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కేఎల్ఎన్ జూనియర్ కళాశాలలో మోడల్ ఎంసెట్ పరీక్ష నిర్వహించారు. ఎంసెట్ ప్రశ్నాపత్రాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఇలాంటి ప్రతిభా పరీక్షలను బాగా రాయాలని కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే ఎంసెట్ పరీక్షలో మంచి ఫలితాలు వస్తే మంచి కళాశాలలో ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వస్తుందన్నారు. పాలక ప్రభుత్వాన్ని విద్యార్థుల తరుపున డిమాండ్ చేస్తూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఎంతగానో డబ్బులు ఖర్చు చేసి చదువుకుంటుంటే ప్రశ్న పత్రాలు లికేజి సమస్య అందరిని వేంటాడుతుందని, ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి పోటి పరిక్షలు, ఇతర పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఎస్ఎఫ్ఐ విద్యార్థులు పోరాడుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజి మున్సిపల్ వైస్ చైర్మెన్ డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వీరేపల్లి వేంకటేశ్వరు,్ల జూనియర్ కళాశాల నరేందర్రెడ్డి, కిరణ్ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మూడవత్ రవినాయక్, ఎస్ఎఫ్ఐ అధ్యక్ష, కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్, డివిజన్ కార్యదర్శి కోర్ర సైదా నాయక్, మిర్యాలగూడ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు వదూద్, మూడవత్ జగన్ నాయక్, సమ్మద్, ఆకాష్, ఉపేందర్, రవి, సాయి, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.