Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆకట్టుకున్న సబ్బండ కులాల ప్రదర్శనలు
- బహుజనుల జీవితాల్లో అఖండ జ్యోతులు వెలిగించిన మహనీయులు ఫూలే, అంబేద్కర్ అని కొనియాడిన వక్తలు
నవతెలంగాణ -నల్లగొండ కలెక్టరేట్
దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ జీవితాల్లో అఖండ జ్యోతులు నింపిన మహనీయులు ఫూలే, అంబేడ్కర్ అని మాజీ ఐఏఎస్, అంబేద్కర్ వాది జేబీ.రాజు కొరియాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తొమ్మిదేండ్లుగా బడుగు బలహీన వర్గాలను రాజ్యాంగ ఫలాలకు దూరం చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎస్బీఆర్ గార్డెన్లో ఫూలే, అంబేద్కర్ జన జాతర కార్యక్రమాన్ని కేవీపీిఎస్, సామాజిక ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఏనాడు అనని విధంగా ఏడుసార్లు జై భీం అన్నాడు. జైభీంతో సర్థిపుచ్చుకుంటే సరిపోదన్నారు. భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలన్నారు. ఫూలే,అంబేద్కర్ చరిత్ర తెలుసుకోలేక పోతే మనం భారతీయులమే కాదని, ఇది వ్యక్తుల చరిత్ర కాదు దేశ ఉద్యమ చరిత్ర అన్నారు. సామాజిక విప్లవకారుడు ఫూలే అని అందుకే అంబేద్కర్, ఫూలేను గురువు భావించాడన్నారు. భారతదేశం గర్వపడే మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే అతను అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ దేశంలో సర్వజనులకు హక్కులను ప్రసాదించాడు. అందుకే అంబేద్కర్ సార్వజనీనుడు అన్నారు.హక్కులు ఇవ్వని మను ధర్మ శాస్త్రాన్ని అమలు చేసే కుట్రలు జరుగుతున్నాయన్నారు. రాజకీయ సమానత్వం కావాలంటే అందరికి ఒకే ఓటు హక్కు కావాలని సామాజిక న్యాయం సాధన దిశగా అవిశ్రాంతంగా అంబేద్కర్ పోరాటం చేశాడని పేర్కొన్నారు. బీజేపీ నేడు మతాన్ని ఆయుధం గా చేసుకొని కుల, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారు.పేదలకు చేరువలో ఉన్న ప్రభుత్వ రంగాన్ని నాశనం చేస్తూ కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తుందన్నారు. రాజ్యంగాన్ని కనుమరుగు చేసే కుట్రలను ఓటుహక్కు ద్వారా బుద్ధి చెప్పాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశ సాధన కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముందుకు వెళ్తున్నారన్నారు. విద్యతోనే మార్పు సాధ్యమని భావించి గురుకుల పాఠశాలను ఏర్పాటుచేసి ఆరు లక్షల మందికి కేసీఆర్ విద్యను అందిస్తున్నారన్నారు. అంబేద్కర్ ఆలోచనతోనే మైనారిటీ లకు రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. నరేంద్ర మోడీ ,బీజేపీ ఈ దేశంలో రాజ్యంగాన్ని ఆగం చేయడానికి కుట్రలు చేస్తోందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ఈడీలు, సీపీఐలను అడ్డంపెట్టుకొని రాజ్యాంగ వ్యవస్థలను కాల రాస్తుందన్నారు. దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు లాంటి పథకాల ద్వారా మార్పు తెస్తున్నామన్నారు. కెేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్ బాబా మాట్లాడుతూ ప్రపంచ ధృవతారలలోఒకరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. ఐక్యరాజ్యసమితి అంబేడ్కర్ పుట్టినరోజుని ది వరల్డ్ నాలెడ్జ్ డేగా ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా జరపాలని చెప్పి పిలుపునిచ్చిందనానరు. ఇంత పెద్ద కీర్తి ప్రతిష్టలు ప్రపంచమంతా అంబేద్కర్ కు పెరుగుతూ ఉంటే అంబేద్కర్ భావాజాలాన్నే కాదు విగ్రహాన్ని కూడా భరించలేకపోతున్నారన్నారు. దేశంలో మన హక్కులను మనుస్మతి ఆదాపాతాల్లోకి తొక్కిందన్న సంగతి గుర్తుపెట్టుకోవాన్నారు. మనుస్మతికి వారసులు సంఫ్‌ు పరివార్ శక్తులైతే 'మేము' రాజ్యంగాన్ని కి వారసులమన్నారు.అలాంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మొత్తం రద్దు కావాలి,రిజర్వేషన్ ఉండకూడదనే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని ఆరోపించారు. బీసీ ి ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్న బీజేపీ, బీసీలకు వ్యతిరేకంగా పోతుందన్నారు.. బీసీ కులగణన ను చేపట్టమంటే చేపట్టమని తెగేసి చెపుతున్నారు. బీజేపీ పట్ల నిరంతర అప్రమత్తతో ఉండాలన్నారు. రిటైర్డ్ ఐ.ఏ.ఎస్ చొల్లేటి ప్రభాకర్ మాట్లాడుతూ భారత ప్రజాస్వామ్య పునాది కి పూలే అంబేద్కర్ ఆలోచనా విధానం గర్వించదగినదని రిటైర్డ్ ఐ.ఏ.ఎస్ చొల్లేటి ప్రభాకర్ అన్నారు.రాజ్యాంగ రచన వల్లనే నాలాంటి ఎంతోమంది ఐఏఎస్ లుగా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు.బడుగులను చైతన్యం చేయడానికి పూలే, అంబేద్కర్ చేసిన కషిని చూసి దేశం గర్విస్తుందన్నారు. దేశంలో పదే పదే అగ్ర కులాలు అధికారంలోకి వస్తున్నాయన్నారు. దీనికి కారణం ఎస్సీ.ఎస్టీ. బీసీ,ి మైనార్టీ ల మధ్య ఐకమత్యం లేకపోవడమే కారణమన్నారు. కార్యక్రమానికి ముందు ఏర్పాటుచేసిన సాంస్కతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను,గంజి మురళిధర్,కొండ వెంకన్న,ఔశెట్టి శంకరయ్య,మురారి మోహన్,చెరుకు పెద్దులు,కుర్రా శంకర్ నాయక్ సమన్వయం చేసిన కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడగు నాగార్జున ,ప్రముఖ రచయిత స్కైబాబ,ఎం.జి.యూ అధ్యాపకురాలు అనిత, రిటైర్డ్ ఎస్.ఈ దున్నా యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు, టిఎన్జిఓ జిల్లా అధ్యక్షులు శ్రవణ్ కుమార్,ఎస్సీ.ఎస్టి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బిక్షపతి, మల్లె పాక ఎంకన్న శంకర్ ముదిరాజ్ మహిళా ఉపాధ్యక్షురాలు సింగం లక్ష్మి కమలమ్మ దళిత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మాడుగుల శ్రీను అంబేద్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు కత్తుల జగన్ కత్తుల షణ్ముఖ ఎల్వి.యాదవ్,విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు, ఎమ్మార్పీఎస్్ సీనియర్ నాయకులు బకరం శ్రీనివాస్ మాదిగ,కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షులు ఆదిమూలం శంకర్,తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు మానుపాటి బిక్షం,దళిత నాయకులు పెరిక కరణ్ జయరాజ్, మాలల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు అద్దంకి రవీందర్, మాజీ కౌన్సిలర్ యండ్డీ సలీం అవుట రవీందర్ యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు మేకల వెంకన్న యాదవ్,మాలిగ యాదయ్య,అవాజ్ సంఘం జిల్లా కార్యదర్శి ఆశం,ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడగు ప్రభావతి, రాష్ట్ర కమిటీ సభ్యురాలు కోడి రెక్క రాధిక రేమీడాలా పరుశరాములు జిట్టా నగేష్ సరోజ గాదె నరసింహ బొల్లు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.