Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువత నిరంతరం ఆశావాహులై ఉండాలి
- కానిస్టేబుల్ పరీక్షలకు వెళుతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు
- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
ఓటమి నుండి స్పూర్తి పొందడమే అసలైన గెలుపు అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక రవి మహల్ ఫంక్షన్ హాల్లో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జరిగిన కానిస్టేబుల్ రాత పరీక్ష కు హాజరు కానున్న అభ్యర్థుల ప్రేరణ (మోటివేషన్) కార్యక్రమం లో ఆయన మాట్లాడారు. యువత నిరంతరం ఆశావాహులై ఉండాలని పేర్కొన్నారు. ఆలోచనలలో పేదరికాన్ని దరి చేరనేయవద్దన్నారు. ఆలోచనలు గొప్పగా ఉంటేనే జీవితంలో ఎత్తుకు ఎదగవచ్చని అన్నారు. పనిచేసే అవలక్షణమే యువత కు గొప్ప కావాలని తెలిపారు. ఏ పని చేయకుండా ఉంటే తన జీవితం లోకి దారిద్య్రంను ఆహ్వానించినట్లే అని అన్నారు. దురదష్టవశాత్తు చదువు అంటే ఉద్యోగం మాత్రమే అనే భావన సమాజాన్ని పట్టి పీడిస్తుందని , ఆ భావనను యువత విడనాడాలన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో సాధించాలనే తపన తో పాటు,యువత క్రీడా స్పూర్తి ని అలవర్చుకోని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ప్రస్తుత సమాజం లో పెద్ద పెద్ద బిజినెస్ మెన్లు, పారిశ్రామిక వేత్తలు కూడా ఒకప్పుడు కూలీలే అని మంత్రి గుర్తు చేశారు. ఒకప్పుడు తెలంగాణ వలసల తెలంగాణ అనే పేరు పొందిన మన రాష్టానికి దేశ వ్యాప్తంగా 30 లక్షల మంది ఇతర రాష్ట్రాల ప్రజలు ఉపాధి కోసం వస్తున్నారని తెలిపారు. యువత ఉపాధికి కొలమానం పరిశ్రమల ఏర్పాటే అని మంత్రి అన్నారు. ఆదివారం జరుగ బోయే కానిస్టేబుల్ పరీక్షలో సూర్యాపేట నుండి హాజరయ్యే 193 మంది యువతీ , యువకులు మెరిట్ సాధించి ఉద్యోగం సాధించే వారికి ముందస్తు అభినందనలు తెలిపిన మంత్రి రాని వారు కూడా జీవితం లో ఇంతకన్నా మెరుగైన పద్దతి లో ఉండటానికి లభించిన అవకాశం భావించాలని కోరారు.ఈ సందర్భంగా కానిస్టేబుల్ పరీక్షలకు వెళుతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.ఏడాది కాలంగా విద్యార్థినీ , విద్యార్థుల కు శిక్షణ ఇచ్చిన అధ్యాపకులను పోలీసులను సత్కరించారు.అనంతరం కానిస్టేబుల్ అభ్యర్థులతో కలిసి భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్పీ రాజేంద్ర ప్రసాద్, అడిషనల్ కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ రాములు, పోలీసు అధికారులు , సిబ్బంది పాల్గొన్నారు.