Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్
నవ తెలంగాణ -ఆలేరుటౌన్
జిల్లాలో సాగునీటి సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందన ఉన్నాయని, ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉండాలని, పనులు వేగవంతం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ అన్నారు. శుక్రవారం పట్టణకేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి నియోజకవర్గాల పరిధిలో ప్రజల చేత ఎన్నికైన శాసనసభ్యులు గొంగిడి సునీత , పైళ్ల శేఖర్ రెడ్డి ,గాదరి కిషోర్ కుమార్ తాగునీటి ప్రాజెక్టుల కోసా కృషి చేయాలని కోరారు. ప్రాజెక్టులపై పురోగతి లేకపోవడం, భూములు కోల్పోయిన వారికి తగిన నష్టపరిహారం చెల్లించకపోవడంతో జిల్లాలోని బీఎన్ తిమ్మాపురం, లప్ప నాయక్ తండ వాసులు దీక్షలు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. మూసీికి ప్రత్యామ్నాయ ంగా గోదావరి జలాల పంపకం జరగాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బునాది గాని కాల్వ ద్వారా నియోజకవర్గంలోని ఆలేరు, ఆత్మకూరు మండలాలకు నిరందించాలన్నారు. ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని స్థానిక శాసనసభ్యురాలు గొంగిడి సునీత హామీ ఇచ్చారని ,అమలు చేయాలని కోరారు. ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా ఏర్పాటు చేయాలన్నారు.ఆలేరు నియోజకవర్గంలోని ప్రతి ఎకరం మగానిగా మార్చే ప్రజల, రైతుల చిరకాల వాంఛ గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణం, నియోజకవర్గం అభివద్ధి పనుల్లో భాగంగా ఉన్నట్టా, లేనట్టా పాలకులు తేల్చాలన్నారు. గంధమల్ల చెరువుతో అలుగులు బోసి జీవనదిగా పారేదన్నారు. ప్రాజెక్టు నిర్మాణంతో జలకళ ఏర్పడుతుందన్నారు. ఆలేరు నియోజకవర్గ ప్రజలకు ప్రాజెక్టు గుండెకాయ లాంటిదన్నారు. ప్రభుత్వ రికార్డులలోనే గంధ మల్ల నుండి జీవనది పారుతున్నట్టు ఉందని వివరించారు. గత 40 ఏండ్ల నుండి కమ్యూనిస్టులు, వామపక్ష , కాంగ్రెస్ ,టీిఆర్ఎస్ ఇతర అన్ని పక్షాలు , ప్రాజెక్టు కోసం ఉద్యమించాయని గుర్తు చేశారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం నుండి ఉలుకు పలుకు లేకపోవడంతో నియోజకవర్గ రైతులు, ప్రజలు అయోమయ పరిస్థితుల్లో ఉన్నారన్నారు. మండలాల్లో సాగు భూమి పెరుగుతుందన్నారు. భూగర్భ జలాలు పెంపొందించబడతాయన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించబడతాయన్నారు. ప్రభుత్వం మొదటగా భారీ నీటి పారుదల శాఖచే,
గంధ మల్ల ప్రాజెక్టు నిర్మాణం కొరకు 9.28 టీఎంసీల కెపాసిటీ నిర్ణయించిందని , ప్రాజెక్టు డిజైన్ చేసిన విధంగా, వెంటనే గంధమాల ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రజల రైతుల పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు, ఎంఏ.ఇక్బాల్ , మండల కార్యదర్శి దుప్పటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.