Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
మహిళలు,ఆడపిల్లల అభ్యున్నతికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న అనేక స్కీమ్ లు తపాలా శాఖలో అందుబాటులో వున్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని పోస్టల్ అడిషనల్ సూపరిండెంట్ కొండ భూమయ్య అన్నారు.శుక్రవారం మండలంలోని అనంతారం గ్రామంలో బీపీఎం లక్ష్మినర్సయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మహిళలకు మహిళ సమ్మాన్ సేవింగ్స్ ఖాతా, సుఖన్య సమృద్ధి యోజన పథకాలపై అవగాహన కల్పించారు.తపాలా శాఖలో మహిళ సమ్మాన్ సేవింగ్స్ ఖాతా అందుబాటులో వుందని మహిళలు,ఆడపిల్లలు దరఖాస్తు ఫారం,ఆధార్ కార్డు,పాన్ కార్డులతో గ్రామంలోని ప్రతి కుటుంబంలో ఒక ఖాతా తెరిచి వుండాలన్నారు..2022-2023 సంవత్సరంలో ఆర్పీఎల్ఐ లో జిల్లాలో మీ గ్రామ బీపీఎం లక్ష్మినర్సయ్య ప్రథమ స్థానంలో నిలిచి ప్రశంసా పత్రం అందుకోవడం అభినందనీయమన్నారు. అనంతరం కొత్తగా ఖాతా తీసిన మహిళలకు మహిళ సమ్మాన్ సేవింగ్స్ ఖాతా బుక్కులను ఆయన చేతుల మీదుగా అందజేశారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ కుమ్మరికుంట్ల రాజారత్నం,కంటి వెలుగు వైద్యురాలు ఝాన్సీరాణి,ఏఎన్ఎం రజియా మహిళలు మంజుల,రమాదేవి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.