Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఉడుత రవీందర్
నవతెలంగాణ-చౌటుప్పల్
దేశంలోని ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని చదవా లని గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఉడుత రవీందర్ పిలుపునిచ్చారు. శుక్రవారం చౌటుప్పల్ పట్టణకేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో పూలే, అంబేద్కర్ జనజాతర సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలోని నరేంద్రమోడి రెండోసారి ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత దేశంలో మహిళలపై వేధింపులు, ముస్లిమ్ మైనార్టీల వస్త్రధారణ, గో మాంసం పేరుతో మూక దాడులు పెరిగాయని విమర్శించారు. మనువాద సిద్ధాంతాన్ని అమలుకు ప్రయత్నిస్తూ రాజ్యాంగం తమకు అనుకూలంగా సవరణకు పాల్పడుతున్నారని తెలిపారు. విద్య కాశాయీకరణలో భాగంగా మొగలుల చరిత్ర, డార్విన్ సిద్ధాంత పాఠ్యంశాలను తొలగిస్తున్నారన్నారు. పూలే, అంబేద్కర్ వారసత్వాన్ని కొనసాగింపుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వృత్తి సామాజిక కార్యకర్తలందరూ రాజ్యాంగ పరిరక్షణకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. కల్లు, గీత కార్మికసంఘం జిల్లా అధ్యక్షులు రాగీరు కృష్ణయ్య అధ్యక్షత వహించిన ఈ సభలో జీఎంపీఎస్ జిల్లా అధ్యక్షులు బండారు నర్సింహా, ప్రధానకార్యదర్శి మద్దెపురం రాజు, సహాయకార్యదర్శి కొండె శ్రీశైలం, చేనేత సంఘం గౌరవ అధ్యక్షులు గోశిక స్వామి, నాయకులు అంతటి అశోక్‌గౌడ్, గుర్రం నర్సింహా, ఎస్కె.మదార్, పబ్బతి పుల్లయ్య, భీమనగోని బాలరాజు, ఉష్కాగుల రమేశ్, శ్రీను, బత్తుల లక్ష్మయ్య, మారగోని అశోక్‌గౌడ్, అరిగె బీరప్ప, ఎర్ర ఊషయ్య, మొగుదాల రాములు, శంకరయ్య, శ్రీను పాల్గొన్నారు.