Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ -ఆలేరుటౌన్
ప్రజా సమస్యలపై ఉద్యమాలకు సీపీఐ(ఎం) పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రెండు రోజులుగా ఆలేరు పట్టణంలో జరుగుతున్న ఆ పార్టీ రాజకీయ శిక్షణా తరగతులలో శుక్రవారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ 9ఏండ్లుగా కేంద్రంలో అధికారం చలాయిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తుందన్నారు. ఎన్నికలకు ముందు ఎన్నో కల్లబొల్లి కబుర్లు చెప్పిన నరేంద్ర మోడీ, అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్లకు ఏజెంట్గా మారాడన్నారు. స్వాతంత్ర అనంతరం 75 సంవత్సరాల కాలంలో చేయబడ్డ జాతీయ సంపదను గుజరాతి పెట్టుబడిదారులకు ధారా దత్తం చేస్తున్నాడని అన్నారు. ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన నరేంద్ర మోడీ కార్పొరేట్ల పంచన చేరడంతో, ఉన్న ఉద్యోగాలు ఊడిపోయి యువత రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని నీరుగారిచే విధంగా రాజ్యాంగ లక్ష్యాలను విస్మరించి, మతతత్వరాజ్యం స్థాపన కోసం ముందుకు పోతున్నాద ని పేర్కొన్నారు. భవిష్యత్తులో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కళ్ళు తెరిపించే విధంగా ప్రజలు ముందుకు వచ్చి పోరాటలతో బుద్ధి చెప్తారన్నారు.రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు 50 వేల రూపాయలు కూడా మాఫీ చేయలేదని ,వెంటనే మిగతా రుణమాఫీ పూర్తి చేయాలని, ప్రతి రైతుకు లక్ష రూపాయలు వచ్చే విధంగా బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికలకు ముందు ఆలేరు ప్రాంత సమస్యలను పరిష్కారం కోసం ఇక్కడి ప్రాంత సాగు తాగు నీటి సమస్యల పరిష్కారం కోసం గంధ మల్ల రిజర్వాయర్ని చేపడతామని హామీ ఇచ్చి ఎనిమిది సంవత్సరాల కాలంలో దాన్ని పూర్తిగా విస్మరించాలని అన్నారు. గంధ మల్ల రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రిజర్వాయర్ సాధన కోసం ప్రజలను కదిలించి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామన్నారు. ఆలేరు ప్రాంత అభివద్ధి కోసం ఈ ప్రాంతాన్ని రెవిన్యూగా డివిజన్ గా సీఎం కెసిఆర్ ప్రకటించినట్లుగా స్థానిక ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి, విలేకరుల సమక్షంలో రెవెన్యూ డివిజన్ గా అభివృద్ధి చేసినట్లుగా ప్రకటించారని, ఇది ప్రకటించి మూడు సంవత్సరాలు గడిచినప్పటికీ ఇంకా అమలుకు నోచుకోవడం లేదని,. వెంటనే ఆలేరు రెవెన్యూ డివిజన్ గా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు ఎం ఏఇక్బాల్ , మండల కార్యదర్శి దూప టీ వెంకటేష్, జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్ ,సిపిఎం సీనియర్ నాయకులు సూదగాని సత్య రాజయ్య, సిఐటియు మండల కన్వీనర్ మోరిగాడి రమేష్, తాళ్లపల్లి గణేష్, పిఎసిఎస్ మాజీ చైర్మన్ మొరిగాడి చంద్రశేఖర్, ఘనగాని మల్లేష్ , మ దిగాడి మహేష్, చే న్న రాజేష్ ,ఎలుగల శివ , కాసుల నరేష్ , బొమ్మ కంటి లక్ష్మీనారాయణ, సంఘీ రాజు , పిక్కగణేష్ ,అందే అంజయ్య , చౌడబోయిన సుధాకర్, యాదగిరి, గ్యార అశోక్ , మైలారం రమేష్ ,మధ్యబోయిన ఉప్పలయ్య, బానోతు భద్రమ్మ, కందుల నాగరాజు ,కటకం సుదర్శన్, ఐలి అంజమ్మ , తోక పద్మ ,ఘనగాని కిష్టయ్య, గొడుగు దాసు, కేతావత్ లక్ష్మి పాల్గొన్నారు.