Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లాకు అవార్డులు వచ్చేలా చూడాలి
- కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ- భువనగిరిరూరల్
పీర్ వెరిఫికేషన్ పై ఎంపీడీవోలు, ఎంపీఓ లకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అవగాహన కల్పించగా, జిల్లాకు అవార్డులు వచ్చేలా చూడాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. శుక్రవారం స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ 2023 కు సంబంధించి పీర్ వెరిఫికేషన్‌కు డీఆర్డీఓ ఉపేందర్ రెడ్డి అధ్యక్షతన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వచ్ఛ సర్వేక్షన్ 2023 కు గాను ప్రతి మండలం నుంచి జనాభా ఆధారంగా మూడు కేటగిరీలుగా, 2000 లోపు జనాభా, 2000 నుంచి 5000 జనాభా, 5000 పై జనాభా గల గ్రామపంచాయతీలుగా విభజించినట్లు తెలిపారు. ప్రతి కేటగిరీలో ఐదు గ్రామపంచాయతీలను ఎంపిక చేసిన జిల్లాకు పంపవలసిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మే ఒకటవ తేదీ నుంచి ప్రారంభమయ్యే పీర్ వెరిఫికేషన్ పై ఎంపీడీవోలు ఎంపిఓలకు శుక్రవారం అవగాహన కల్పించారు. ఈ వెరిఫికేషన్ లో ప్రతి మండలానికి ఒక టీం ముగ్గురు చొప్పున ఏర్పాటు చేసి , ఒక మండల టీం పక్క మండలానికి వెళ్లి ఆమని గ్రామపంచాయతీలలో సర్వే నిర్వహించాల్సి ఉంటుందన్నారు. సర్వే ఫలితాలను సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ఉపాధి హామీ చట్టం అమలులో భాగంగా జిల్లాలోని 17 మండలాల్లో అన్ని గ్రామ పంచాయతీలలో పని కోరిన కూలీలందరికీ పని కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, గ్రామీణ అభివృద్ధి అధికారి ఉపేందర్ రెడ్డి, అదనపు డి ఆర్ డి ఓ నాగిరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సునంద, జిల్లాలోని వివిధ మండలాల ఎంపీడీవోలు, ఎంపీఓ లు, స్వచ్ఛ భారత్ మిషన్ జిల్లా కన్సల్ టెంట్లు పాల్గొన్నారు.