Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి
నవతెలంగాణ- భూధాన్ పోచంపల్లి
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి ,వైస్ ఎంపీపీ పాక వెంకటేశం అన్నారు. పోచంపల్లి మండలం కనుముకుల శివారెడ్డి గూడెం ఇంద్రియాల పెద్దగూడెం ఆయా గ్రామాలలో ఐకెేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిం చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు, సాగునీరు, ఉచిత విద్యుత్ పెట్టుబడి సాయం అందించడంతో అధిక ధాన్యం ఉత్పత్తితో దేశంలో తెలంగాణ ముందజలో ఉందన్నారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఎకరానికి రూ.10 వేల పెట్టుబడి సాయం కింద అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మెన్ కందాల భూపాల్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి ఆయా గ్రామాల సర్పంచులు .ఎంపీటీసీలు వార్డు సభ్యులు రైతులు, తదితరులు పాల్గొన్నారు.