Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నీరు లేక పత్తి పై ఆధారపడి వ్యవసాయం
- పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేంతవరకు ఉద్యమాలను కొనసాగిస్తాం
నవతెలంగాణ-మునుగోడు
బంగారం లాంటి భూములు ఉన్న ఈ ప్రాంతానికి సాగునీరు లేకపోవడంతో వల్లకాడుల ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉన్నాయని సీపీిఐ జిల్లా కార్యదర్శి నెల్లికటి సత్యం అన్నారు. నల్లగొండ జిల్లా సమగ్ర అభివృద్ధి, జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను పరిష్కారం కోసం సీపీఐ ఆధ్వర్యంలో గత నెల 20వ తేదీన మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండలంలో ప్రారంభమైన పాదయాత్ర సోమవారం మునుగోడు మండలానికి చేరుకుంది. ఈ సందర్భంగా సీపీఐ, సీపీఐ(ఎం) తో పాటు వివిధ ప్రజాసంఘాల నాయకులు పాదయాత్ర సభ్యులకు ఘన స్వాగతం పలికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతమంతా ఫ్లోరైడ్ పీడత ప్రాంతం కావడంతో సాగు తాగునీరు లేక వ్యవసాయంపై ఆధారపడి జీవించే రైతులు భూములను సాగు చేసుకునేందుకు రైతులు 7 వందల అడుగుల లోతు బోర్లు వేసిన చుక్క నీరు రాని పరిస్థితి దాపరించిందని అన్నారు. ఈ ప్రాంతంలోని ఫ్లోరైడ్ , సాగు తాగునీరు సమస్య పరిష్కారం కోసం దశాబ్దాల కాలం నుండి నల్లగొండ జిల్లాలో ఉభయ కమ్యూనిస్టులు అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించామని తెలిపారు. ఈ ప్రాంతంలో వ్యవసాయ సాగు పై ఆధారపడి జీవిస్తున్న చిన్న సన్నకారు రైతులు పట్టణాలకు వలస కూలీలుగా అడ్డమీది కూలి పనులపై ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో సాగు నీరు లేకపోవడంతో ఉపాధి అవకాశాలు లేక ప్రతి రైతు పత్తి పై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నది జలాల సమస్య పరిష్కారం చేయకుండా కృష్ణా నదిలో తెలంగాణ వాటా ఎంత అనేది స్పష్టం చేయకపోవడంతో అనేక ప్రాజెక్టులు పర్యావరణ, అటవీ అనుమతుల చట్టం పేరుతో ప్రాజెక్టులన్ని పూర్తిగా నిలిచిపోయాయని మండిపడ్డారు. కృష్ణా నదిలో ఎక్కడైతే నీరు తీసుకోవాలని ఆ ఎట్టం దగ్గర కనీసం రిజర్వాయర్ కానీ టెండర్ గాని ప్రభుత్వం పిలవకపోవడం దారుణమన్నారు. త పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా జాతీయ హౌదా కావాలన్నా ఉభయ కమ్యూనిస్టులతో పాటు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా రైతుల రుణమాఫీ , నిరుపేదలకు ఇంటి నిర్మాణం కోసం మూడు లక్షలు , దళిత బంధు , గొల్ల కురుమలకు గొర్ల ను లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ నది జలాల సమస్య , నల్గొండ జిల్లా సమగ్ర అభివృద్ధి , ఈ ప్రాంత ప్రాజెక్టుల మీద ఉభయ కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చుట్టుతామని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా కమ్యూనిస్టుల పోరాటాల ఖిల్లా అని తెలంగాణ సాయిధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న ధర్మ బిక్షం ,మల్లు స్వరాజ్యం , భీమ్‌రెడ్డి నరసింహారెడ్డి , ఆరుట్ల కమలాదేవి , నర్రా రాఘవరెడ్డి సాయిధ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఉభయ కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ప్రాజెక్టుల సాధన కోసం పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు మే 4న చండూరులో నిర్వహించే పాదయాత్ర ముగింపు సభకు జిల్లా నలుమూలల నుండి వేలాదిమంది హాజరై విజయవంతం చేయాలని కోరారు .
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేంతవరకు ఉద్యమాలు కొనసాగిస్తాం
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి
నల్గొండ జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేంతవరకు ఉభయ కమ్యూనిస్టులు ఆధ్వర్యంలో ఉద్యమాలను కొనసాగిస్తామని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం సిపిఐ చేపడుతున్న పాదయాత్ర మునుగోడుకు చేరుకున్న సందర్భంగా సంఘీభావం తెలిపి పాదయాత్రలో పాల్గొన్నారు. అనంతరం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఆయన మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలో భాగంగా డిండి ప్రాజెక్టుకు ఎద్దుల రిజర్వాయర్ ద్వారా దిండి తుంది బిందు వరకు గ్రావిట్, పైప్ లైన్ ద్వారా గాని నీరు తీసుకొచ్చి డిండి ప్రాజెక్టుపైన బ్యారేజీ నిర్మించి బ్యారేజ్ ద్వారా ఐదు రిజర్వాయర్లు సింగరాజుపల్లి , గొట్టుముక్కుల , చింతపల్లి , కిష్టరామ్ పెళ్లి చెర్లగూడెం రిజర్వాయర్లకు నీళ్లు ఇవ్వాలన్నారు. మునుగోడు దేవరకొండ ప్రాంతాలలో సుమారు మూడు లక్షల 42 వేల ఎకరాలకు నీరు అందించేందుకు డిపిఆర్ త్వరగా ఆమోదం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఇటీవల ఏర్పడిన కృష్ణ బోర్డు అనుమతి సాధించి ఈ ప్రాజెక్టులను పూర్తి చేసి ఈ ప్రాంతానికి సాగునీరు అందించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సంఘీభావం తెలిపిన వారిలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ, మునుగోడు సర్పంచ్ మిర్యాల వెంకన్న, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మిర్యాల భరత్, సహాయ కార్యదర్శి వరికుప్పల ముత్యాలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్.అంజయ్యచారి, కే.శ్రీనివాస్, బచ్చనగోని గాలయ్య, బొలుగూరి నరసింహ, జి.రామచంద్రన్, టి.వెంకటేశ్వర్లు, చాపల శ్రీను, ఈదులకంటి కైలాస్, గోస్కొండ లింగయ్య, బిలాలు, బండమీది యాదయ్య, మందుల పాండు, లింగస్వామి, వెంకన్న, సత్తమ్మ, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.