Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే జూలకంటి
- సీపీఐ(ఎం)లో చేరిన పలు పార్టీల నాయకులు
వేములపల్లి : కార్మికులకు కర్షకులకు అండ ఎర్రజెండా అని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని ఆమనగల్, లక్ష్మీదేవి గూడెం, ముల్కపట్నం, రావులపెంట, వేములపల్లి గ్రామాల్లోప్రపంచ కార్మిక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు ఎల్లప్పుడూ ఎర్రజెండా అండగా ఉంటుందని అందుకే కార్మికులు ఎర్రజెండా పక్షాన నిలుస్తున్నారన్నారు. 137 సంవత్సరాల క్రితం అమెరికాలోని చికాగోలో కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారన్నారు. రక్తం చిందించి కార్మిక హక్కులు సాధించుకున్న దీక్షా దినంగా ప్రతి సంవత్సరం ఘనంగా మేడేను జరుపుకుంటారన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలన్నారు.
సీపీఐ(ఎం)లో చేరికలు
మండలం కేంద్రంలోని ఎన్ఎస్పి క్యాంపులో పలు పార్టీలకు చెందిన సుమారు 50 మంది జూలకంటి రంగారెడ్డి సమక్షంలో సీపీఐ(ఎం)లో చేరారు. తోట జానకిరాములు, మల్లికంటి నరేష్,నాంపల్లి యాదగిరి మల్లేష్ ,శ్రీకాంత్ ,మాధవరెడ్డి కోల రవి ,లతీఫ్, తదితరులు పార్టీలో చేరిన వారిలొ ఉన్నారు. వారికి మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పాదూరు గోవర్థన, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు రొండి శ్రీనివాస్, నాయకులు ప్రణీత్‌రెడ్డి, పుట్టల సైదులు, ఏసు, కోడిరెక్క వెంకన్న, బొంగరాల వెంకటయ్య, పతాని శ్రీను తదితరులు పాల్గొన్నారు.