Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి
- సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-చౌటుప్పల్
మేడే అమరవీరుల పోరాట స్ఫూర్తితో మోడి ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు. సోమవారం చౌటుప్పల్ మండలం, మున్సిపాలిటీలో 137వ ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణకేంద్రంలో సీపీఐ(ఎం) మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. గ్రామగ్రామాన, వాడవాడలా సీపీఐ(ఎం), సీఐటీయు కార్మిక జెండాలను ఎగురవేశారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక సీఐటీయు కార్యాలయంలో నిర్వహించిన సభలో సీతారాములు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికుల పని గంటలు సాధించడం కోసం 137 సంవత్సరాల క్రితం ప్రాణాలు త్యాగం చేశారని, ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో మేడే పండుగను నిర్వహిస్తున్నారని తెలిపారు. మనదేశంలో 8 గంటల పని విధానానికి తూట్లు పొడుస్తూ 12 గంటలు కార్మికులు శ్రమ చేసే విధంగా కార్మిక చట్టాలను మోడి ప్రభుత్వం లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ దేశ సంపద దోచిపెడుతుందన్నారు. ప్రతి సంవత్సరం కార్పొరేట్లకు సంబంధించిన లక్షల కోట్ల రూపాయలను మాఫీ చేస్తుందన్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ పేదలపై భారాలు మోపుతున్న బీజేపీ ప్రభుత్వంపై ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు. సీఐటీయు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడుతూ స్వాతంత్య్రానికి పూర్వం నుంచి ఇప్పటి వరకు ఉన్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్పొరేట్లకు అనుకూలమైన నాలుగు లేబర్ కోడ్లను మోడి ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. ఈ లేబర్ కోడ్లు రద్దు అయ్యే వరకు రైతాంగ పోరాట స్ఫూర్తితో ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు. సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు ఎమ్‌డి.పాషా అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బూర్గు కష్ణారెడ్డి, మండల, మున్సిపల్ కార్యదర్శులు గంగదేవి సైదులు, బండారు నర్సింహా, మున్సిపల్ వైస్‌ఛైర్మన్ బత్తుల శ్రీశైలం, నాయకులు ఆదిమూలం నందీశ్వర్, గోపగోని లక్ష్మణ్, దండ అరుణ్‌కుమార్, బత్తుల దాసు, గడ్డం వెంకటేశ్, గోశిక స్వామి, చీరిక సంజీవరెడ్డి, బత్తుల లక్ష్మయ్య, విప్లవ్‌కుమార్, గోశిక కరుణాకర్, ఉష్కాగుల రమేశ్, శ్రీను, చెన్నబోయిన వెంకటేశ్, ఆకుల ధర్మయ్య, చీరిక అలివేలు, దేప రాజు, దాడి సురేందర్‌రెడ్డి, జొన్నకంటి దేవయ్య, కలకుంట్ల శివ, గుణమోని రాములు, బోయ యాదయ్య, నెల్లికంటి నర్సింహా, మీసాల రవి, పాపయ్య పాల్గొన్నారు.