Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలి
- మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-హుజూర్నగర్టౌన్
దేశంలో అన్ని వర్గాల సంక్షేమాన్ని విస్మరించి ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని గద్దించడమే లక్ష్యంగా మే డే స్ఫూర్తితో కార్మికులు ఉద్యమించాలని సిపి ఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం మేడేను పురస్కరించుకొని సీఐటీయూ, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జెండాలు ఆవిష్కరించి స్థానిక పాత బస్టాండ్ వద్ద జరిగిన సభలో మాట్లాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వివిధ రకాల మతాలు, సాంప్రదాయాలు గల మనదేశంలో బిజెపి అధికారంలోకి వచ్చాక ప్రజల మధ్య మతాల పేరుతో చిచ్చు పెడుతూ పాలన సాగిస్తున్నారన్నారు. విపరీతంగా ధరలు పెంచి సామాన్య ప్రజలను జీవనం సాగించలేని దుస్థితిలోకి నెట్టివేశారన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించలేని దద్దమ్మ ప్రధాని మోడీ అని విమర్శించారు .రాష్ట్రంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం రానున్న నాలుగు నెలల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ ఆ దిశగా ముందుకు వెళ్లినట్లయితే ప్రజల ఆశీర్వాదంతో ఆయన అనుకున్న విధంగా తిరిగి అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. అసంఘటిత రంగంలో ఉన్న సుమారు కోటి మంది కార్మికుల సంక్షేమానికి తప్పక చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగారపు పాండు , జిల్లా కమిటీ సభ్యులు పల్లె వెంకటరెడ్డి, దుగ్గి బ్రహ్మం, భూక్య పాండు నాయక్, మండల కార్యదర్శి పోసనబోయిన హుస్సేన్ ,సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శీలం శ్రీను, కౌన్సిలర్ త్రివేణి, భవన నిర్మాణ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలక సోమయ్య గౌడ్, నాయకులు తుమ్మకొమ్మయోన, మురళి, వెంకటరెడ్డి ,వీరమల్లు, లింగమ్మ ,పులిచింతల వెంకటరెడ్డి, వెంకటనారాయణ, నరసయ్య, వీరయ్య ,నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పాలకీడు : మండల కేంద్రంలో మేడే ఉత్సవాలను సీఐటీయూ భవన నిర్మాణ కార్మిక సంఘం, సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం మండల కేంద్రంలోని వీధి వీధినా రెడ్ టీ షర్టులు, ఎర్రజెండాలతో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ కార్మికులారా ఏకంకండి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని నినదిస్తూ డప్పు చాటింపులతో కదం తొక్కారు. భారీగా హాజరైన వివిధ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులతో నూతన మండలంలో ఎర్రజెండాలు రెపరెపలాడాయి. సిఐటియు జిల్లా నాయకుడు కందగట్ల అనంత ప్రకాష్, ఉమ్మడి నేరేడుచర్ల మండల మాజీ జడ్పిటిసి ముషం నరసింహ లు మాట్లాడుతూ, మే డే విశిష్టతను, కార్మికుల హక్కులను, బాధ్యతల గురించి వివరించారు. అమెరికాలోని చికాగో నగరంలో పురుడు పోసుకున్న ఎర్రజెండా నేపథ్యాన్ని కార్మిక సోదరులతో పంచుకున్నారు. అమరులైన ఇరుకు బిక్షం, పెద్దులు స్తూపాల వద్ద నివాళులర్పించారు. కార్మిక చట్టాలను కాల రాస్తున్న బిజెపికి పార్టీలకతీతంగా ప్రజాస్వామ్యవాదులు, లౌకిక శక్తులు ఏకమై, తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు వేముల రామయ్య, రహీం, పిఎసిఎస్ వైస్ చైర్మన్ పగడాల మట్టేష్, కొండ పెద్ద ఎల్లయ్య, వడ్డే సైదయ్య, వీరభద్రం, ఏసురత్నం, ఎంపీటీసీ దొంగల వెంకటయ్య, పురుషోత్తం రెడ్డి, రాజు నాయక్, కార్మికులు అజీద్, మీసాల మహేష్, తిరుపతయ్య, కోటేశ్వరరావు, అబ్దుల్లా లతో పాటు మహిళలు, పిల్లలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు.
డెక్కన్ ఫ్యాక్టరీలో
కార్మికులకు, కర్షకులకు బిఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, ఆ పార్టీ మండల అధ్యక్షుడు కిష్టిపాటి అంజిరెడ్డి స్పష్టం చేశారు. మండల కార్మిక విభాగం నాయకుడు కత్తి దానయ్యతో కలిసి డెక్కన్ ఫ్యాక్టరీ సమీపంలో మేడే ఉత్సవాల్లో భాగంగా, జెండాను ఆవిష్కరించి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి ఎ సి ఎస్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, మహంకాళి గూడెం సర్పంచ్ శ్వేతా విజరు, కాటా కోటిరెడ్డి, వెంకటరెడ్డి, మరియదాసు, పిడమర్తి ప్రేమ్ కుమార్, పెరుమళ్ళ సతీష్, వంశీ ఫ్యాక్టరీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
కోదాడరూరల్ : కార్మికులకు అండ సిఐటియు జెండా అని సిఐటియు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోటగిరి వెంకటనారాయణ అన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ నుండి సిఐటియు కార్యాలయం వరకు బారి ర్యాలీ నిర్వహించారు. అనంతర పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, సిఐటియు సీనియర్ నాయకులు జుట్టు కొండ బసవయ్య, సిఐటియు పట్టణ కార్యదర్శి ఎం ముత్యాలు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు వెల్ది పద్మావతి, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కాసాని కిషోర్, సిపిఎం నాయకులు డాక్టర్ సూర్య నారాయణ, దాసరి శ్రీనివాస్, నక్క గోపి, నారదాసు శ్రీనివాస్, సాయికుమార్, గంట నాగరాజు, పి కాటయ, కొండలు, కిషోర్, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
పోరస్ లేబరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో
కేంద్ర ప్రభుత్వం కార్మికులకు రోజుకు పనిగంటలు12 గంటల విధానాన్ని తీసుకొచ్చింది కార్మికులు పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని దినానికై మరో ఉద్యమానికి సిద్ధం కావాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం రాంబాబు , ఉపాధ్యక్షులు ఎస్ రాధాకృష్ణలు పిలుపు నిచ్చారు.సోమవారం మండల పరిధిలోని నల్లబండ గూడెం గ్రామంలో పోరస్ లేబరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ముందు సిఐటియు జెండా ఎగరేసి వారు మాట్లాడారు. అనంతరం రామాపురం క్రాస్ రోడ్ నుండి నల్లబండగూడెం చిమిర్యాల క్రాస్ రోడ్డు వరకు కార్మికులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు కోల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి కాలసాని సురేష్, కోశాధికారి మైలార్శెట్టి కోటేశ్వరరావు, కార్మికుల నాగభూషణం, ఎం రాజా, బి రామారావు, ఎం హేమ సుందర్, తదితర కార్మికులు పాల్గొన్నారు.
పలు పార్టీల ఆధ్వర్యంలో...
పట్టణంలోని ఆయా పార్టీల కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని జండా ఆవిష్కరించారు. ఐ ఎన్ టి యు సి ప్రాంతీయ కమిటీ అధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పారా సీతయ్య ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన మేడే వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పబ్లిక్ క్లబ్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. టిడిపి పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం క్రాస్ రోడ్ లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి మేడే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించి పార్టీ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు.ఏఐటీయూసీ మేకల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా మే డే వేడుకలు నిర్వహించారు.సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ దాని అనుబంధ కార్మిక సంఘం అయిన ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో పట్టణంలోని లాల్ బంగ్లా వద్ద , కోమరబండ గ్రామంలో పార్టీ, కార్మిక సంఘం దిమ్మెలపై మూడు చోట్ల జెండాల ఆవిష్కరణ చేసి మేడే అమరులకు ఘనంగా నివాళ్లు అర్పించి, చికాగోలో చిందిన అమరుల నెత్తురు సాక్షిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై సంఘటితంగా పోరాడుదాం అని పిలుపునిచ్చారు. అదేవిధంగా మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో ఎంపీపీ చింతా కవిత రాధారెడ్డి సిపిఐ జెండాను ఆవిష్కరించి మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ ముత్తినేని సైదేశ్వర రావు,పార్టీ అద్యక్షులు ఉప్పుగండ్ల శ్రీనివాసరావు,అరుణోదయ జిల్లా అధ్యక్షులు ఉదయగిరి, ఐఎఫ్టియు నాయకులు మద్దెల ప్రతాప్, టిఆర్ఎస్ నాయకులు చందు నాగేశ్వరరావు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
అనంతగిరి: కార్మికులకు అండ ఎర్రజెండా అని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి రాపోలు సూర్యనారాయణ అన్నారు. స్థానిక అనంతగిరి మండలంలో మేడి సందర్భంగా వివిధ గ్రామాలలో సీపీఐ(ఎం), సిఐటియు జెండా ఆవిష్కరణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జుట్టుకొండ వీరయ్య, కోటేశ్వరరావు, గోపతి బిక్షమయ్య, శ్రీనివాసరావు, కె చిన్న వెంకటేశ్వర్లు, కే పెద్ద వెంకటేశ్వర్లు, వెంపటి శ్రీనివాస్ ,గోపతి గోపయ్య, తదితరులు పాల్గొన్నారు.
హుజూర్నగర్ : పట్నంలో మే డే సందర్భంగా సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం గాంధీ పార్క్ వద్ద జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని కార్మికులంతా ఐకమత్యంగా పోరాటం చేసినట్లయితే తమరు సాధించుకోవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు గుండా రమేష్ గాంధీ పార్క్ వద్ద జండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలకూరి బాబు, కంబాల శ్రీనివాస్, ఎల్లావుల రాములు, దేవర మల్లేశ్వరి, సిపిఐ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వరు, పాల్గొన్నారు.
చిలుకూరు : వాడ వాడల ఎర్రజెండాలతో కమ్యూనిస్టులు ఉద్యమించిన తీరు హర్షించదగ్గ విషయమని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జే.నరసింహరావు అన్నారు. సోమవారం మండలంలోని బేతవోలు చిలుకూరు కొండాపురం ఆచార్యగూడెం, చిన్నారిగూడెం గ్రామాలలో ఎర్రజెండాలను ఎగురవేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి నాగాటి చినరాములు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నారా సాని వెంకటేశ్వర్లు, బత్తిని వెంకటయ్య, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు మైలార్ శెట్టి లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.
మునగాల :మండలంలోని వివిధ గ్రామాల్లో సీపీఐ (ఎం) పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా మేడే ఉత్స వాలను నిర్వహించారు. ఈ సందర్భం గా పార్టీ కార్యాలయాల ముందు జండాలను అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బుర్రి శ్రీరాములు, మేదరమెట్ల వెంకటే శ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు దేవరం వెంకటరెడ్డి, నర్సింహులగూడెం మాజీ సర్పంచ్ జూలకంటి కొండారెడ్డి, నాయకులు పార్టీ మండల కార్యదర్శి చందా చంద్రయ్య, దేశిరెడ్డి స్టాలిన్ రెడ్డి బచ్చలకూర స్వరాజ్యం, ఎస్ కె సైదా, నందిగామ సైదులు, ఆరె రామకృష్ణారె డ్డి, పాల్గొన్నారు.
పెన్పహాడ్ : ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో సిఐటియు ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు రణపంగ కృష్ణ పాల్గొని జెండా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్లు రద్దు అయ్యేంతవరకు అలుపెరుగని పోరాటాలకు కార్మికవర్గం సిద్ధం కావాలని ఆయన పిల్నునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ధనియాకుల శ్రీనివాస్, గుంజ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో
ప్రపంచ కార్మిక దినోత్సవ సందర్భంగా బీఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఆ సంఘం మండల ప్రధాన కార్యదర్శి గూడపూరి ఉపేందర్ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ ఊరుకొండ జానకమ్మరాధాకృష్ణ, బిఆర్ఎస్ జిల్లా నాయకులు తూముల ఇంద్రసేనారావు, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు దొంగరి యుగంధర్, గ్రామ అధ్యక్షుడు ఒగ్గు గోపి, ప్రధాన కార్యదర్శి షేక్ రహ్మాన్, పిఎసిఎస్ డైరెక్టర్ గూడపూరి రవి, కోఆప్షన్ సభ్యులు షేక్ రఫీ, ఒగ్గు వీరయ్య, ఒగ్గు కనకయ్య, షేక్ మీరా, తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేట : ప్రపంచ మానవాళికి దోపిడి నుండి విముక్తి మార్గం చూపించేది ఎర్రజెండా యేనని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మధి వెంకటేశ్వర్లు అన్నారు.సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక భగత్ సింగ్ నగర్ లో మే డే ఉత్సవాలో ఆయన మాట్లాడారు. పెట్టుబడిదారులు, దోపిడీదారుల నుండి మానవాళికి విముక్తి ఎర్ర జెండా ద్వారా కలుగుతుందన్నారు. ఎర్రజెండానే పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సంఘటితంగా అందరిని ఐక్యం చేసి పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. పాలకులు ప్రజలపై బారాలు మోపితే ప్రజలకు గుర్తొచ్చేది ఎర్రజెండాని తెలిపారు. పెట్టుబడిదారులకు ,కార్పొరేట్ శక్తులకు కొమ్ముగాస్తున్న ప్రభుత్వాలపై ఎర్రజెండా నాయకత్వంలో ఉద్యమాలను ఉధృతం చేసినప్పుడే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట గోపి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వీరబోయిన రవి, ప్రజా నాట్యమండలి జిల్లా అధ్యక్షులు బచ్చలకూరి రాంబాబు, సిపిఎం శాఖ కార్యదర్శి కోటా సృజన, సభ్యులు తిరుపతమ్మ, అమృతమ్మ, నిర్మల,భీష్మా రెడ్డి, నాగమణి,నారాయణ, అంజయ్య, లక్ష్మయ్య, సతీష్, సూర్య తేజ, సాయి తేజ,నరేష్, సిద్దు, సహస్ర, వంశీ తదితరులు పాల్గొన్నారు.
ఎనిమిది గంటల పని దినం కోసం చికాగో నగరంలో జరిగిన పోరాటం విజయవంతమై నేడు మే డే ను జరుపుకుంటున్నామని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ రాములు అన్నారు. ఈ మేడే స్ఫూర్తితో హక్కుల సాధనకు ఉద్యమించి మన హక్కుల్ని కాపాడుకోవాలని ఆయన ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. మేడే సందర్భంగా సోమవారం స్థానిక ఆ సంఘం జిల్లా కార్యాలయంలో పతాకాన్ని ఎగురవేసి ఆయన మాట్లాడారు. ి ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎన్ సోమయ్య కోశాధికారి జి వెంకటయ్య రాష్ట్ర కమిటీ సభ్యులు జె. యాకయ్య, జిల్లా కార్యదర్శులు ఎస్. కె.సయ్యద్, వీరారెడ్డి, బి.ఆడమ్,ఆడిట్ కమిటీ సభ్యులు పల్లె.అనిల్ కుమార్,చిలక.రమేష్, డి.లాలు, సోషల్ మీడియా కన్వీనర్ డి. శ్రీనివాస చారి,అకడమిక్ సెల్ కన్వీనర్ రాంపల్లీ .శ్రీను, సాంస్కతిక కమిటీ కన్వీనర్ బి. ఆనంద్, మండల బాధ్యులు డి బాలాజీ , తదితరులు పాల్గొన్నారు.
నూతనకల్ : మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని పలు గ్రామాలలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఘనంగా మేడే ఉత్సవాలను సోమవారం నిర్వహించారు. ఆ పార్టీ మండల కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి ఆ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అన్ని గ్రామాలలో గ్రామ శాఖ కార్యదర్శిలు జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు అలిపురం సంజీవరెడ్డి బొజ్జ శ్రీను పోలేపాక నగేష్ కూసు సైదులు కందాల కృష్ణారెడ్డి ,ఎర్ర ఉప్పల్ రెడ్డి శ్రీను, బత్తుల తిరుమలేశు, ఉప్పుల రమేష్ ,హరీష్, మహబూబా ,తదితరులు పాల్గొన్నారు.సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పెద్దింటి రంగారెడ్డి శ్రీనివాసరెడ్డి ,మందడి భూపాల్ రెడ్డి, మున్న అశోక్ , ఐఎఫ్టియు ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య,, దేశోదు మధు తదితరులు పాల్గొన్నారు.
నేరేడుచర్ల : మేడే సందర్భంగా పట్టణ కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆ సంఘం మండల కన్వీనర్ నీలా. రామ్మూర్తి అధ్యక్షతన జరిగిన సభలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పారేపల్లి శేఖర్ రావు,జిల్లా కమిటీ సభ్యులు కొదమగుండ్ల నగేష్ మాట్లాడుతూ చికాగో నగరం లో కార్మికుల రక్త తర్పణంతో సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆపార్టీ మండల కార్యదర్శి సిరికొండ శీను సీనియర్ నాయకులు కుంకు తిరుపతయ్య ,అనేగంటి మీనయ్య, పాతూరి. శ్రీను, ఎడ్ల సైదులు, ఎస్కే ఆఫీజ్, మొగిలిచర్ల రుద్రమ్మ, కుంకు ఆదిలక్ష్మి, కృష్ణవేణి, భవన నిర్మాణ సంఘం మండల అధ్యక్షులు యారవ. శ్రీనివాస్ బొల్లేపల్లి శీను, తాడోజు శ్రీను, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.
మోతే : చికాగో అమరవీరుల స్ఫూర్తితో పాలకుల అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు పిలుపునిచ్చారు .సోమవారం ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడేను పురస్కరించుకొని ఆ పార్టీ పార్టీ దాని అనుబంధ సంఘాలైన భవన నిర్మాణ కార్మికులు ,పారిశుధ్య కార్మికులు హమాలీ సంఘాల ఆధ్వర్యంలో మండల కేంద్రంతో పాటు రాఘవాపురం ఎక్స్ రోడ్డు రాఘవాపురం సిరికొండ బుర్కచర్ల గ్రామాలలో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్చి వేస్తూ కార్మిక ప్రయోజనాలకు నష్టం కలిగించే చర్యలకు పాల్పడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి ముల్కూరు గోపాల్ రెడ్డి మండల కమిటీ సభ్యులు గుంట గాని ఏసు, కాంపాటి శ్రీను ,నాగ మల్లయ్య ,కిన్నెర పోతయ్య, బూడిద లింగయ్య ,బానోతు లచ్చిరాం ,రావుల వెంకన్న, రేపాల వెంకన,్న హుస్సేన్, రవిచంద్ర, కొత్త వీరారెడ్డి, జలగం తిరుపతయ్య, ఒగ్గు సైదులు, దోసపాటి ఈదయ్య, తదితరులు పాల్గొన్నారు.
న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో పాటు రావి పహాడ్ ఉషానవాద గ్రామాలలో మేడే ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలోసబ్ డివిజన్ కార్యదర్శి కునుకుంట్ల సైదులు డివిజన్ నాయకులు కాకి మోహన్ రెడ,ి్డ కోట మధుసూదన్ రెడ్డి, పి వై ఎల్ జిల్లా నాయకులు వీరబోయిన రమేష్ ,మాజీ ఎంపీటీసీ పొడ పొంగి ముత్తయ్య, పి వై ఎల్ డివిజన్ నాయకులు బండి రవి ఏఐకేఎంఎస్ గ్రామ అధ్యక్షులు లింగయ్య , తదితరులుపాల్గొన్నారు.
నడిగూడెంలో ఘనంగా మేడ ఉత్సవాలు నవ తెలంగాణ మూతి నడిగూడెం మండల కేంద్రముతో పాటు పది గ్రామాల్లో సిపిఎం సిఐటియు ఆధ్వర్యంలో 10 గ్రామాల్లో మేడే ఉత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ మే డే విశిష్టతను కార్మికులకు వివరించారు మేడే ఉత్సవాల లో జిల్లా కమిటీ సభ్యులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు మండల మాజీ వైస్ ఎంపీపీ కొరట్ల శ్రీనివాస్ ఏనుగులు వీరాంజనేయులు బృందాన వన పురం సర్పంచి బెల్లంకొండ హనుమయ్య రేఖ తిరుపతయ్య సిఐటియు మండల కన్వీనర్ మల్లెల వెంకన్న వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఎస్కే సైదా హుస్సేన్ పి అనిల్ పి నాగమణి వెంకటేశ్వర్లు ఎస్కే మస్తాన్ రాములు బొడ్డు వెంకటనారాయణ కేసగాని భద్రయ్య సతీష్ రెడ్డి పిచ్చయ్య వెంకన్న పాల్గొన్నారు
చివ్వేంల : మే డే సందర్బంగా మండలవ్యాప్తంగా వాడవాడలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో సీపీఐ(ఎం) గ్రామ శాఖ ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ ఇట్టమల్ల ఏసోబు జెండా ఎగుర వేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బచ్చలకూర రామ్ చరణ్ ,జిల్లా కమిటీ సభ్యులు వేల్పుల వెంకన్న, మండల కమిటీ సభ్యులు కలగాని సోమయ్య, బొప్పాని సులోమాన్,సిపిఎం నాయకులు స్టాలిన్, బచ్చలి కన్నయ్య, జాన్ రెడ్డి, లక్ష్మి ,బుర్రి ఎలిషా, సోమయ్య, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరు ఎస్ : మే డే సందర్భంగా ో ఏపూర్ గ్రామంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి అవిరే అప్పయ్య జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కమిటీ సభ్యులు సాన బోయిన ఉపేందర్ శాఖ కార్యదర్శి నూకల గిరి ప్రసాద్ రెడ్డి , బిక్షం,ముత్తయ్య , ఎరుకల నాగరాజు మల్లయ్య, లింగయ్య, నవిల వెంకన్న, మహేష్, ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.
అర్వపల్లి : కార్పొరేట్ల, గుత్తా పెట్టుబడి దారుల ప్రయోజనాల కోసం పరితపించే ప్రభుత్వాలపై సమరశీల పోరాటాలు సాగించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు పేర్కొన్నారు.మేడే సందర్భంగా మండల కేంద్రంలో అరుణా పతాకం ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రపంచ పెట్టుబడి దారీ వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని, మోడీ చెపుతున్న విజన్ విఫలం అయిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీమండల కార్యదర్శి వజ్జె శ్రీనివాస్ , మండల నాయకులు సిగ వెంకన్న సంపతి వెంకన్న, చెన్నబోయిన వీరయ్య ,వజ్జే సైదయ్య, వజ్జె వినరు యాదవ్, జమడగుంట్ల కృష్ణయ్య, కొమ్ము విజరు, దేవరకొండ యాదయ్య ,పనస భద్రయ్య మర్రి సైదులు ,జాటో సుధాకర్, రామావత్ వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మి నరసింహ స్వామి ప్రైవేట్ ఎలక్ట్రిషన్ టెక్నీషియన్ యూనియన్ జాజిరెడ్డిగూడెం ఎలక్ట్రిషన్ మిత్రులు ఎలక్ట్రిషన్ ఆధ్వర్యంలో జెండావిష్కరణ కార్యక్రమాన్ని బైరబోయిన భూమయ్య బరిక శ్రీనివాసులు జండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల చెందిన నాయకులు. వివిధ గ్రామాల చెందిన అధ్యక్షులు గ్రామాల్లోజండా ఆవిష్కరణ నిర్వహించారు కార్యదర్శులు నాయకులు పాల్గొన్నారు
సూర్యాపేట కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ విక్రమ్ భవన్ ముందు ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య రాంజీ జెండా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ రాష్ట్ర సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, పీఓడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షులగులాం హుస్సేన్,కోశాధికారి గోగుల వీరబాబు, ఎల్ హెచ్ పి ఎస్ నాయకులు నాగేందర్, జిల్లా నాయకులు జీవన్, వాజీద్, రమేష్, సైదులు, పర్షురామ్,సుధాకర్, రాజశేఖర్, సందీప్, సునీల్,నగేష్, పద్మ,శైలజ, వెంకటమ్మ, హుస్సేన్,సింహాద్రి, తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేట రూరల్: నీకోసం నువ్వే పోరాడకుండా, నలుగురి కోసం పోరాడు అని ట్రాక్టర్ ఓనర్స్ అధ్యక్షుడు మానక ఎల్లయ్య స్వామి అన్నారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు రాయిని గూడెం గ్రామంలో మేడే జెండాను ట్రాక్టర్స్ యూనియన్ అధ్యక్షుడు మానక ఎల్లయ్య స్వామి ఆవిష్కరించి మాట్లాడరు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి మెకనబోయిన సైదమ్మ, సీపీఐ ఎం పార్టీ మండల నాయకులు మెకనబొయిన శెఖర్,కొప్పుల రజిత,మందడి రాంరెడ్డి,కామళ్ల లింగయ్య, పిట్టల వెంకన్న, నల్లమెకల సైదులు,పల్లపు రజిని కుమార్,భాస్కర్,అశోక్, నరేష్,నగేష్,వేణు,మహేష్, తిరుమలేశు,తదితరులు పాల్గొన్నారు.
తిరుమలగిరి : కార్మికుల హక్కుల సాధన కోసం సాగిన మహౌజ్వల చికాగో కార్మికుల పోరాటం స్పూర్తి తో నేడు భారతకార్మిక వర్గం ఉద్యమించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు పిలుపు ఇచ్చారు.మేడే సందర్భంగా మండల కేంద్రంలో జరిగిన సభలో పాల్గొని మాట్లాడారు. మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా ఆదాని అంబానీ లకు కట్టబెడుతోందన్నారు. పట్టణ కేంద్రంలో వాడ వాడాలో అరుణా పతాకాలు ఎగురవేసి మేడే ఉత్సవాలు జరిపారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి గుమ్మడవెల్లి ఉప్పలయ్య, కడెం లింగయ్య,కడారి లింగయ్య, మిట్టపల్లి లక్ష్మి,నియమాలు యాకయ్య,వైనం సోమయ్య,మిర్యాల యాదయ్య, బిందెల అబ్రహం,తోపులాటలో సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
మండల కేంద్రంలో అన్ని యూనియన్ల ఆధ్వర్యంలో మేడేను ఘనంగా నిర్వహించి జెండాలు యూనియన్ అధ్యక్షులు ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో బీఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్ ,హమాలీ యూనియన్ అధ్యక్షుడు ఏనుగుల రామచంద్రు ప్రధాన కార్యదర్శి చిప్పలపల్లి యాదగిరి, ఏనుగుల వెంకన్న, దాసు, మాణిక్యం, బసవయ్య, మేడి నగేష్, నరసయ్య, రఫీ, వెంకట్ పాల్గొన్నారు.
తుంగతుర్తి :మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని వివిధ గ్రామాలలో సోమవారం కార్మిక దినోత్సవం సందర్భంగా మేడే ఉత్సవాలను సోమవారం అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐటియు,ఏఐటీయూసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి బుర్ర శ్రీనివాస్, ఏఐటీయూసీ నాయకులు బొంకూరు శ్యాంసుందర్,న్యాయవాది రాజారాం, కోటా రామస్వామి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పులుసు సత్యం, రైతు సంఘం జిల్లా నాయకులు పల్లా సుదర్శన్, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు నగేష్,రమేష్, సీపీఐ(ఎం) నాయకులు విష్ణుమూర్తి,అంతయ్య, ట్రాక్టర్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు బోర నరేష్, శ్రీకాంత్ రెడ్డి, నాయకులు సామేలు, పాలకుర్తి లచ్చయ్య, కార్మిక సంఘాల నాయకులు పాల్వాయి పున్నయ్య,హుస్సేన్,బొంకూరి ఎల్లయ్య, వీరస్వామి, యాదయ్య వంగ శంకర్ జలేందర్ తదితరులు పాల్గోన్నారు.