Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
మేడే స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణ కోసం, కార్మిక చట్టాలను, హక్కులను రక్షించడానికి, కార్మిక కర్షక పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయంలో ఎర్రజెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 18 గంటలు 16 గంటలు కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకునే వాళ్ళని ఈ వెట్టి చాకిరికి వ్యతిరేకంగా 8 గంటల పనిదినం కోసం పోరాడి సాధించారన్నారు. ఆ సమయంలో కార్మికులపై పోలీసు కాల్పుల్లో మరణించిన కార్మికుని రక్తంలో తడిసిన బట్టలే ఎర్రజెండాగా ఎగురవేశారు. 1890 నుంచి నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా మేడే నిర్వహించుకుంటున్నారని తెలిపారు. 1823లో మద్రాసు పట్టణంలో కార్మిక నాయకుడు సింగర్ వేలు మొట్టమొదటిసారిగా మేడేను నిర్వహించారని 1823 నుంచి నేటి వరకు 100 సంవత్సరాలు పూర్తయిందని, ఆ అమరవీరులు పోరాడి సాధించిన ఎనిమిది గంటల పనిదినం నేడు భారతదేశంలో ప్రమాదానికి గురి అవుతుందని తెలిపారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లు తేచ్చిందని, అవి సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు, పోరాడే హక్కు భేరసారాలు, పోరాడే హక్కు అనేక సంక్షేమ పథకాలు అన్ని రద్దు చేస్తూ కార్పొరేట్లకు, ధనవంతులకు అనుకూలంగా చట్టాలు తెచ్చిందని, దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున సమరశీలమైన ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పాలకులు కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని లేనిపక్షంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని, కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని, ఐకేపీ, వీవో ఏలు చేస్తున్న న్యాయమైన సమ్మెను సమస్యలు పరిష్కరించి నియమింప చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. లేనిపక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తిరిగి అధికారం రాకుండా చూడడమే నేడు కార్మిక వర్గం ముందున్న పెద్ద సవాల్ అని, బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం అంతా బీజేపీని ఓడించేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు తుమ్మల వీరారెడ్డి, నాది ఐలయ్య, బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, ప్రభావతి, సిహెచ్ లక్ష్మీనారాయణ, పీ నర్సిరెడ్డి, ఎండి సలీం, ధన్యంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, భూతం అరుణ తదితరులు పాల్గొన్నారు.
14వ వార్డులో..
ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా నల్లగొండ పట్టణంలోని డాక్టర్స్ కాలనీ నటరాజ్ టాకీస్ రోడ్డు 43 వ వార్డులో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం కుంభం కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలోసుధాకర్రెడ్డి మాట్లాడారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలను సవరించి కార్పొరేట్ వ్యవస్థలకు లాభం చేకూర్చేందుకు బీజేపీ ప్రయత్నించడం బాధాకరం అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యురాలు తుమ్మల పద్మ, లక్ష్మమ్మ, నరసమ్మ, ప్రసన్న, శివమ్మ, సుగుణమ్మ, నీలమ్మ, ఎస్ విష్ణుమూర్తి, పి కార్తీక్, ఎం రామచంద్రం, భాస్కర్, మేకల రవీందర్ రెడ్డి, కే .ముత్తయ్య, కల్లెట్ల వెంకన్న, జి.నరసింహ, యనమల నారాయణ, బట్ట సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
యూటీఎఫ్ కార్యాలయంలో...
జిల్లా కార్యాలయంలో మే డే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు, రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజశేఖర్‌రెడ్డి, పాల్గొన్న ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం, కోశాధికారి నర్రా శేఖర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శులు సిహెచ్.రామలింగయ్య, జి. నరసింహ్మ, ఎన్. వెంకన్న, పీ.సైదులు, పీ.నరసింహ, వివిధ మండలాల బాధ్యులు పాల్గొన్నారు.
సీపీఐ(ఎం) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో..
సీపీఐ(ఎం) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. సందర్భంగా పట్టణ కార్యాలయంపై జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు తుమ్మల పద్మ, పట్టణ కమిటీ సభ్యులు గాదె నరసింహ, దండంపల్లి సరోజ, ఉట్కూరు మధుసూదన్‌రెడ్డి, భూతం అరుణకుమారి, గంజి నాగరాజు, మారగొని నగేష్, నవతెలంగాణ సిబ్బంది, మట్టయ్య, వరుణ, పుష్ప తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ కార్యాలయంలో..
137వ మేడే ఉత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలోని నవతెలంగాణ రీజియన్ కార్యాలయంలో మేనేజర్ పుప్పాల మట్టయ్య జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో డెస్క్ ఇన్చార్జి మేకల వరుణమ్మ, సిబ్బంది పుష్పలత, గిరిబాబు, వీరబోయిన పంచలింగం, మారగొని నగేష్, బత్తుల ఉపేంద్ర, జర్నలిస్టులు జాజాల కృష్ణ, సంజీవ, రాంప్రసాద్, పాల్గొన్నారు.
శ్రీనగర్ కాలనీలో...
మేడే సందర్బంగా నల్లగొండ పట్టణంలోని శ్రీనగర్ కాలనిలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నారిఐలయ్య ఎర్ర జెండా వేశారు. ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శి బోడ ఇస్తారి, నాయకులు కన్నేకంటి సత్యం, కన్నెకంటి దుర్గ ప్రసాద్, నారి సుజీత్ కుమార్,ఆప్పయ్య,చిర్రబోయన మహేశ్, కె సౌమ్య,కె ప్రసన్న లక్ష్మీ, బి జానకి,మునగాల రిత్వీక్ రెడ్డి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
మాడుగులపల్లి : మండల కేంద్రంలో అమరవీరుల స్మారక భవన్ వద్ద మేడే ఉత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. మేడే ఉత్సవాలకు ముఖ్యఅతిధిగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి హాజరై జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రోండి శ్రీను, పుల్లెంల శ్రీకర్, మల్లారెడ్డి, అశోక్ రెడ్డి, రవి ,సర్పంచ్ ఎర్ర కన్నయ్య, రాజు, వెంకన్న ,విద్యాసాగర్ రెడ్డి, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అమరుల త్యాగాలు రక్షించుకుందాం
కార్మిక, రైతు వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటలకు సిద్ధం
పట్టణంలో పలుచోట్ల అరుణ పతాకాల ఆవిష్కరణలు
మేడే ర్యాలీలో కార్మిక నాయకుల పిలుపు
నవతెలంగాణ-నల్లగొండ
చికాగో నగరంలో యాజమాన్యాల తూటాలకు బలైన అమరుల త్యాగాలను రక్షించుకోవడానికి కార్మిక, కర్షకులంత ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమరయ్య భవన్ నుండి కార్మిక బైక్ ర్యాలీ బోయవాడ, రామగిరి, శివాజీ నగర్, హైదరాబాదు రోడ్డు, పెద్దగడియారం, మైసయ్య విగ్రహం, ప్రకాశం బజార్, మిర్యాలగూడ రోడ్ మీదుగా కలెక్టరేట్ వరకు జరిగింది. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ పనిగంటల కోసం ఆనాడు కార్మిక వర్గం చేస్తున్న పోరాటాలపై యాజమాన్యాలు చేసిన కాల్పుల్లో మరణించిన రక్తంలో నుండి పుట్టింది ఎర్రజెండా అని, నాటి పోరాట స్ఫూర్తిని తీసుకొని నేడి కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న కార్మిక చట్టాల మార్పులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా సీనియర్ నాయకులు సయ్యద్ హాశం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ఇండ్లు ఇళ్ల స్థలాలు పెన్షన్లు ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ బైక్ ర్యాలీలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ. సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, సాగర్ల యాదయ్య, జక్కల రవికుమార్, సలివొజు సైదాచారి, నకెరికంటి సుందరయ్య, ఆవురేష్ మారయ్య చల్లా యాదయ్య దొండ శ్రీశైలం పెరిక కష్ణ, సాగర్ల మల్లయ్య, బచ్చలకూరి గురువయ్య, మునుగ వెంకన్న, నాగమణి, చంద్రమ్మ, పెరిక అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలోపలుచోట్ల అరుణ పతాకాల ఆవిష్కరణలు
వ్యవసాయ మార్కెట్ యార్డులో..
ఎస్ఎల్బీసీ వ్యవసాయ మార్కెట్ యార్డులో పనిచేస్తున్న హమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సీఐటీయూ జెండాను హమాలీ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య ఆవిష్కరించారు. హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న హమాలీలను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ నాయకులు బుర్ర లింగస్వామి, దొండ శ్రీశైలం, కొత్త మాధవ్, లక్ష్మమ్మ బచ్చగొని మల్లేష్ లింగయ్య తదితరులు పాల్గొన్నారు .
మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో...
మేడే సందర్భంగా మున్సిపల్ కార్యాలయం ముందు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ జెండాను ఆ యూనియన్ పట్టణ అధ్యక్షులు ఎండీ. సలీంలి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానం రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ జిల్లా కార్యదర్శి జక్కల రవికుమార్, పట్టణ కార్యదర్శి పెరిక కష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్ల సంజీవ, గుండుమల్ల శ్రీనివాస్, పెరిక అంజమ్మ, పందుల లింగయ్య, సావిత్రమ్మ, జీడిమెట్ల నరసింహ, తదితరులు పాల్గొన్నారు.
ఎఫ్‌సీఐ హమాలి యూనియన్ ఆధ్వర్యంలో...
భారత ఆహార సంస్థ గొల్లగూడా గోదాం దగ్గర సీఐటీయూ జెండాను రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ఆవిష్కరించారు. 50సంవత్సరాలు నిండిన హమాలిలకు 6వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పట్టణంలో జిల్లా కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్ వర్కర్స్, బేవరేజస్ హమాలి,స్టోర్ హమాలి, రైస్ మిల్ హమాలీలు, పట్టణ ఎగుమతి దిగుమతి హమాలీలు ఆర్టీసీ ఎస్ డబ్యు,ఎఫ్, తాపీ,సెంట్రింగ్,ప్లంబర్, కార్పెంటర్ లు ,టైల్స్, పెయింటర్స్, లిఫ్ట్ వర్కర్స్, ఆటో,మినీ ట్రాస్పోర్ట్, మెషిన్ భగీరథ,టెంపర్ వరి డ్రైవర్ లు వివిధ ట్రాస్పోర్ట్ హమాలి లు,పవర్ లూమ్ వర్కర్స్,రిక్షా కార్మికులు, సామిల్ వర్కర్స్, జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో వివిధ రంగాల కార్మికులు అద్దంకి నర్సింహ, సలివొజు సైదాచారి, బోడ ఇస్తారి, జక్కల రవికుమార్, పల్లె నగేష్, కావేరి నర్సింహ, కత్తుల యాదయ్య, వేముల వెంకన్న, సాయి, లింగస్వామి, తదితరులు పాల్గొన్నారు.
పలుచోట్ల జెండావిష్కరణలు
పేదలకు అండదండగా ఎర్రజెండా ఎల్లప్పుడూ ఉంటుందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాశమ్ అన్నారు. సోమవారం ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా నల్లగొండ పట్టణంలో పానగల్లు, పెద్ద బండ, కతాల గూడెం, చైతన్య నగర్, చర్లపల్లి, శ్రీరామ్ నగర్, బీటిఎస్, ఆర్టీసీ కాలనీ, శివాజీ నగర్, తదితర 18 చోట్ల సీపీఐ(ఎం) జెండాలను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమాలలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నారి ఐలయ్య, పట్టణ కార్యదర్శి ఎండి. సలీం, జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, ఉట్కూరి నారాయణరెడ్డి, పట్టణ కమిటీ సభ్యులు కుంభం కష్ణారెడ్డి, అద్దంకి నరసింహ, దండెంపల్లి సరోజ, పాక లింగయ్య, గాదె నరసింహ, మైల యాదయ్య భూతం అరుణ కుమారి, మధుసూదన్ రెడ్డి, మారగోని నగేష్ గంజి నాగరాజు బొడ ఇస్తారి, రుద్రాక్ష శేఖర్ గుండాల నరేష్ ఆకిటి లింగమ్మ పనస చంద్రయ్య దండంపల్లి దశరథ బోయపల్లి చంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.
నల్గొండ రూరల్ : కనగల్లు మండలంలో సీపీఐ(ఎం), సీఐటీయూ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు పాలడగు ప్రభావతి మండలంలోని పలు గ్రామాలలో మేడే జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై మేడే స్పూర్తితో ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం), సీఐటీయూ నాయకులు కానుగు లింగస్వామి, కందుల సైదులు, నెలకొండ రాశి, లింగయ్య, అక్రమ్, సుల్తానా, శేఖర్ రెడ్డి, యాదయ్య, మల్లికార్జున, కృష్ణయ్య, వెంకన్న, లక్ష్మీనారాయణ, ఎద్దులు కాసింగౌడ్, నరసింహ బిక్షం తదితరులు పాల్గొన్నారు.
చిట్యాల : కార్మికులకు కనీస హక్కులు ఉండాలని వీరోచితంగా పోరాడి హక్కులు సాధించుకున్న రోజే మేడే అని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య అన్నారు. చిట్యాల మండలం చిన్న కాపర్తిలో మేడే సందర్భంగా హమాలి యూనియన్ అధ్యక్షులు సైదులు జండావిష్కరణ చేశారు. ఈ మేడే కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రూరల్ మండల కార్యదర్శి అరూరి శీను, మండల నాయకులు రుద్రారపు పెద్దులు, గ్రామ శాఖ కార్యదర్శి కోనేటి రాములు, లోడె విఘ్ణమూర్తి, ఆవుల మల్లయ్య, మామిడి హన్మంతు, హనుమయ్య మణెమ్మ, సరిత తదితరులు పాల్గొన్నారు. మండలంలోని వెలిమినేడు, ఉరుమడ్ల, వనిపాకల, పిట్టంపల్లి తదితర గ్రామాలలో మేడేను ఘనంగా నిర్వహించారు. చిన్న కాపర్తి గ్రామంలో ఐకేపి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పని చేసే ముప్పై మంది హమాలిలు సిఐటీయులో చేరారు.
చిట్యాలటౌన్ : పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని సీపీఐ(ఎం), సీఐటీయూ నాయకులు జిట్ట నగేష్, నారబోయిన శ్రీనివాసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చిట్యాలలో సోమవారం నిర్వహించిన మేడే కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. మేడే సందర్భంగా సీఐటీయూ ఆధ్వర్యంలో చిట్యాల మండల కేంద్రంలో బారీ ప్రదర్శన నిర్వహించారు. జండాలను పార్టీ నాయకులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య, పామనుగుల్ల అచ్చాలు, అరూరి శీను,జిట్ట సీపీఐ(ఎం) సరోజ ఆవిష్కరించగా, సీఐటీయూ జండాలను జిల్లా ఉపాధ్యక్షులు నారబోయిన శ్రీనివాస్‌లు, మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు ఏనుగు వెంకట్ రెడ్డి, రైస్ మిల్లు డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు ఏళ్ళ మారయ్య, వీఓఏ యూనియన్ అధ్యక్షురాలు ఎదుళ్ల లక్ష్మి, లారీ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు యం డి అజిత్, హమాలి యూనియన్ అధ్యక్షులు దూడల యాదయ్య, ప్రైవేటు ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బందెల యాదగిరి, ఆటో డ్రైవర్ల యూనియన్ అధ్యక్షులు మేడి దుర్గయ్య లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు ఐతరాజు నర్సింహ, మెట్టు పరమేష్, బొబ్బిలి సుధాకర్‌రెడ్డి, రుద్రారపు పెద్దులు, కడగంచి నర్సింహ, పాల లక్ష్మయ్య, రమేష్, మేడి సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు.
చండూర్ : చండూరులో మేడే సందర్భంగా సోమవారం సీపీఐ(ఎం) జెండాను ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండా శ్రీశైలం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనంతరం హమాలీ వర్కర్స్ యూనియన్ జెండాను చిన్న వెంకన్న, వివో ఎలా సంఘం జెండాను యాదగిరి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జెండాను సైదులు వేరువేరుగా ఆవిష్కరించారు. సీఐటీయూ కార్మిక సంఘాల జెండాలను మే డే సందర్భంగా చండూరు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మొగుదాల వెంకటేశం, మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయగౌడ్, గౌసియాబేగం, చిట్టిమల్ల లింగయ్య, కొత్తపల్లి నరసింహ, హమాలీ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షులు చిన్న వెంకన్న, లింగస్వామి, నాగరాజు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శిసైదులు, ఉపాధ్యక్షులు లింగస్వామి, వీవో ఎలా మండల అధ్యక్షులు పడసబోయిన యాదగిరి, కార్యదర్శి అహల్య,తదితరులు పాల్గొన్నారు.
కేతపల్లి : చికాగో కార్మికులు స్ఫూర్తిని ముందుకు తీసుకుపోతామని అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తామని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ చిన్న వెంకులు కార్మికులకు పిలుపునిచ్చారు. మేడే సందర్భంగా కేతపల్లి మండలంలో వివిధ గ్రామాలలో సోమవారం మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.. కేతపల్లి మండల కేంద్రంలో జరిగిన మేడే ఉత్సవాలలో పార్టీ పతాకాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి చింతపల్లి లుర్డు మారయ్య, సీనియర్ నాయకులు బొల్ల నర్సింహారెడ్డి, సిఐటియు మండల కన్వీనర్ ఆదిమల్ల సుధీర్ కుమార్, పార్టీ మండల కమిటీ సభ్యులు చెవిగొని నాగయ్య, కర్రె బాలయ్య, జి శ్రీనివాసులు, భాగ్యమ్మ, గుండాల లచ్చమ్మ, శ్రీపతి వెంకన్న, చెరుకు సత్తయ్య, దుర్గం నాగరాజు, చౌడయ్య, పల్లయ్య, ఆశీర్వదమ్మ, లింగయ్య, సత్తిరెడ్డి, నాగయ్య పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మేడే
కేతెపల్లీ మండలం లోని వివిధ గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేడే జెండా ను ఎగుర వేశారు. కొత్తపేట గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు రాచకొండ సైదులు మాజీ ఎంపీటీసీ సభ్యురాలు దాసరి సునీత, నాయకులు పూర యాదగిరి, సత్యనారాయణ, ఎస్కె.యూసుఫ్, జడ లింగయ్య, దాసరి లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ రూరల్ : మేడే స్ఫూర్తితో మతోన్మాదాన్ని తిప్పికొడదాం దేశాన్ని కాపాడుకుందామని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున అన్నారు. సోమవారం నల్లగొండ మండలంలోని జీ.చెన్నారం, దోమలపల్లి, కాంచనపల్లి, అప్పాజీపేట, పెద్ద సూరారం, జీకే అన్నారం, చందనపల్లి, గ్రామాలలో మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించి జెండాలు ఎగరవేశారు. ఈ సందర్భంగా ప్రదర్శనలు చేశారు. ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి నలపరాజు సైదులు, జిల్లా కమిటీ సభ్యురాలు కొండ అనురాధ, మండల కమిటీ సభ్యులు సత్యనారాయణ, కొండ వెంకన్న, ఉప్పుల గోపాలు, ముసుకు బిక్షం, బొల్లు రవీందర్, బొల్లోజు భారతమ్మ , కట్టా అంజయ్య, వాణి లక్ష్మమ్మ, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
గడియారం సెంటర్లో..
నల్లగొండ పట్టణం గడియారం సెంటర్లో సోమవారం నిర్వహించిన మేడే వేడుకలలో సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు కార్మిక లోకానికి మేడే శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్య అతిధిగా పాల్గొని జెండా ఆవిష్కరణ చేసి ఆయన మాట్లాడారు. కార్మికులు సంఘటితమై ఒక్కతాటి మీదికి వచ్చినప్పుడు కార్మిక సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.
చింతపల్లి : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాల రాస్తున్నాయని తెలంగాణ ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి చేల్లం పాండురంగారావు అన్నారు. సోమవారం చింతపల్లి మండలం గోడకండ్ల వీటి నగర్లో హమాలీయులైన ఆధ్వర్యంలో ఏఐటీయూసీ పతాకాన్ని ఎగరవేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హమాలి యూనియన్ నాయకులు నరసింహ, ఆనంద్, అంజయ్య , యాదయ్య, దుర్గయ్య, శంకర్, అబ్బాయా తదితరులు పాల్గొన్నారు.
దామరచర్ల : దామరచర్ల మండలం లో కార్మిక దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) కార్యాలయంలో మండల కార్యదర్శి వినోద్ జెండాను ఎగురవేశారు. చైతన్య భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కూడా మె డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాపా నాయక్, దయనంద్, బాబా, సుదర్శన్, సైదులు, నాగయ్య, తదితరులు పాల్గొన్నారు. సీపీఐ, ఏఐటీసీల ఆధ్వర్యంలో కూడా మే డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి లింగా నాయక్, శ్రీరాములు, వెంకటేశ్వర్లు, సిద్దు తదితరులు పాల్గొన్నారు.
నాగార్జునసాగర్ : నందికొండ మున్సిపాలిటీ కార్యాలయం మరియు బస్టాండ్ వద్ద భవననిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేడే ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఎఐటియుసి జెండాను కార్మిక నాయకులు వల్లపు నాగార్జున ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ కార్మికులారా ఏకంకండి అనే నినాదం కార్మికుల హక్కుల కోసం ఆనాడు చికాగోనగరంలో ప్రారంభమైన పోరాటం నేడు ఎర్ర జెండాగా మారి మనకు కార్మిక చట్టాలను తెచ్చి పెట్టిందన్నారు.ఈ కార్యక్రమంలో పల్లవుల వెంకటరమణ,ఇస్మాయిల్, మంగత నాయక్,బాణావత్ హరిచంద్ర నాయక్ ,ప్రతాప్, శివ ,భాస్కర్ రామకష్ణ, ఇబ్రహీం, రాములు, శ్రీను ఇట్లుభవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తిరుమలగిరి సాగర్ : కార్మికులకు రక్షణగా ఉన్న 29 చట్టాలను రద్దుచేసి యాజమాన్యాలకు అనుకూలంగా ఉండే నాలుగు లేబర్ కోడ్ తీసుకురావడం సరైనది కాదని, వాటిని రద్దు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కున్రెడ్డి నాగిరెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో సీపీఐ(ఎం), సీఐటీయూ సంఘాల ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా కార్మిక రైతు వ్యతిరేక పాలనపై ప్రజలు చైతన్యవంతులై పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం జెండాను సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు వేములకొండ పుల్లయ్య ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కోర్ర శంకర్‌నాయక్, సీనియర్ నాయకులు సముద్రాల కృష్ణయ్య, సీఐటీయూ మండల కార్యదర్శి ఎస్కే. చాంద్ పాషా, సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు జటావత్ రవినాయక్, ఆంగోత్ రెడ్యానాయక్, రమావత్ స్వామి నాయక్, రమావత్ విజయ, శ్రీను, సీఐటీయూ నాయకులు మోహన్‌నాయక్, అలీ వెంకటయ్య, శ్రీను, కుర్ర రాజునాయక్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
హలియా : 1886లో అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన పోరాటపలితంగా సాధించుకున్న ఎనిమిది గంటల పని దినాన్ని నేడు మోడీ ప్రభుత్వం నిరంకుశంక చట్టాల సవరణ పేరుతో ప్రయివేట్ యాజమాన్యాలకు కొమ్ముకాస్తుందని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కున్రెడ్డి నాగిరెడ్డి ఆవేదన వ్యక్తపరిచారు. సోమవారం ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో రైస్ మిల్ బజార్ హమాలి రిక్షా భవన నిర్మాణ కార్మికులు, మార్కెట్ హమాలి, వివిధ కార్మికుల అడ్డాల వద్ద మేడే కార్యక్రమాన్ని జరుపుకొని జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అవుతా సైదులు, నాయకులు కత్తి శ్రీనివాస్‌రెడ్డి, పొదిల వెంకన్న, కారంపొడి ధనమ్మ, ఏసోబు, అన్నపాక శ్రీను, జాను, పరశురాం, ఖలీల్, యాదయ్య, పేరూరు శ్రీను, గణపతి, జాన్మియా, లింగయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
త్రిపురారం :త్రిపురారం మండల పరిధిలోని పెద్దదేవులపల్లి గ్రామంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సోమవారం ముఖ్య అతిథిగా మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కొప్పు వెంకన్న, సిహెచ్ లక్ష్మయ్య, సిహెచ్ సుధాకర్, మేకల వెంకన్న, ఎస్.కె జానీ, పడిశాల సైదయ్య, సిపిఐఎం నాయకులు, సిఐటియు నాయకులు ,కార్మిక సంఘాలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మాడుగులపల్లి : కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి కార్మికుల పొట్టగొడుతున్నదని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా మండలంలోని కుక్కడం విశాఖ ఇండిస్టీలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి జెండా ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి, జిల్లా నాయకులు రొండి శ్రీనివాస్, దండెంపల్లి సత్తయ్య, కంభంపాటి పర్షరాములు, నాయకులు బొంగర్ల యల్లయ్య,షేఖ్ సయ్యద్,బొంగర్ల శ్రీను,గుడుగుంట్ల శ్రీధర్,బొంగర్ల వెంకటయ్య,బొమ్మకంటి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
మునుగోడు : ఎనిమిది గంటల పని విధానం కార్మికుల హక్కుల కోసం ప్రాణాలర్పించిన మేడే అమరవీరుల స్ఫూర్తితో కార్మిక వర్గం ఉద్యమాలకు సిద్ధం కావాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. సోమవారం మేడే దినోత్సవం పురస్కరించుకొని మునుగోడు మండల కేంద్రం పలివెల, గూడపూర్ కొంపెల్లి గ్రామాలలో సిఐటియు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మునుగోడు సర్పంచ్ మిర్యాల వెంకన్న సిఐటియు మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు, నాయకులు మిర్యాల భరత్, యాసరాని శ్రీనివాస్, వేముల లింగస్వామి , యాట యాదయ్య , పగడాల కాంతయ్య , నారగోని నరసింహ , యాసరాని శివ , రెడ్డి మల్ల యాదగిరి , ఎర్ర అరుణ, అండాలు తదితరులు పాల్గొన్నారు.