Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ -ఆలేరురూరల్
నిధులు నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టారని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామం లో పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో వారు మాట్లాడుతూ ఉద్యోగాల నియామకాలపై ఉద్యోగ క్యాలెండర్ ను విడుదల చేస్తామన్నారు. అప్పటివరకు నిరుద్యోగ భతిని చెల్లిస్తామన్నారు. అంతకుముందు గ్రామ సమీపంలో ఉన్న బికేరు వాగును పరిశీలించి . తర్వాత ఆరుట్ల స్థూపాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు .అనంతరం మాట్లాడుతూ ఓట్ల కోసమే పాదయాత్ర కాదన్నారు. కొలనుపాక గ్రామాన్ని ఆరుట్ల రామచంద్రారెడ్డి కమలాదేవి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న గొప్ప వ్యక్తులు అన్నారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గంలో భూములు అమ్మాలంటే కేవలం గొంగిడి దంపతుల దగ్గర పర్మిషన్ తీసుకుంటే సరిపోతుందన్నారు. గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో రేషన్ కార్డు లేని వారికి కూడా ఇండ్లు ఇవ్వడం దురదృష్టకరమన్నారు .ఆలేరు మాజీ ఎమ్మెల్యే కుడుదుల నగేష్ మాట్లాడుతూ బట్టి విక్రమార్క మచ్చలేని నాయకుడిగా పేరు సంపాదించుకున్నాడన్నారు. గ్రామానికి అనుకొని ఉన్న ఐ లెవెల్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని గతంలో ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి మాట్లాడుతూ ఆత్మగౌరవాన్ని గడీల ముందు కేసీఆర్ తాకట్టు పెట్టారు అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ,టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి ,కాంటెస్ట్ ఎమ్మెల్యే కల్లూరి రామచంద్రారెడ్డి ,మండల ఎంపీపీ గంగమల అశోక్, మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వరరాజు, టౌన్ అధ్యక్షుడు ఎజాజ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి, గ్రామ శాఖ అధ్యక్షుడు విజేందర్రెడ్డి ,ప్రధాన కార్యదర్శి చాడ రాజు, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఇమ్రాన్ ఖాన్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ ,యువజన విభాగం మండల అధ్యక్షులు లోకేష్, ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షులు సుంకరి విక్రం ,ముదిరాజ్ సంఘం మహిళ జిల్లా అధ్యక్షురాలు బోయిన ఝాన్సీ, నాయకులు మహేష్ ,కిరణ్,అజరు, దశరథ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలను పలకరిస్తూ సమస్యలు తెలుసుకుంటూ కొనసాగిన భట్టి పాదయాత్ర
ఆలేరుటౌన్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సోమవారం ఆలేరు పట్టణం నుంచి కొనసాగింది. ఆలేరు పట్టణంలో పంచాయతీ కార్యదర్శులు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కని కలిసి తమ ఉద్యోగాలను ప్రభుత్వం రెగ్యులర్ చేసే విధంగా అసెంబ్లీలో మాట్లాడాలని కోరారు. ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు, కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని వివరించారు. ఆ తర్వాత బీరప్ప గడ్డ వద్ద పంచర్ షాప్ నడుపుతున్న రమేష్ వద్దకు వెళ్లి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు వచ్చిన సంక్షేమ పథకాలు గురించి భట్టి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత నత్తనడకన సాగుతున్న అండర్పాస్ రైల్వే బ్రిడ్జి పనులను పరిశీలించారు. బీడీ కార్మికురాలు పోశం అరుణ తమ సమస్యలను ఏకరువు పెట్టింది. నిరుద్యోగి ఆలేటి బాలరాజు వచ్చి తన ఆవేదనను బట్టితో విన్నవించనుకున్నాడు. ఆ తర్వాత హెయిర్ సెలూన్ యజమాని ముత్యాల వెంకటేశ్ వద్దకు వెళ్లి భట్టి విక్రమార్క అతని సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఆలేరు నుంచి కొలనుపాక గ్రామానికి వెళ్తున్న పాదయాత్రను చూసి వరి ధాన్యం పండించిన రైతు బైరి భాస్కర్ గౌడ్ భట్టి విక్రమార్క వద్దకు వచ్చి ఆయన పొలంలో తడిసిన ధాన్యం వద్దకు తీసుకువెళ్లి చూపించారు.
మేడే ఉత్సవాల్లో ..
ప్రపంచ కార్మిక దినోత్సవ సందర్భంగా సోమవారం జరిగిన మేడే ఉత్సవాల్లో భట్టి విక్రమార్క ఆలేరులో పాల్గొన్నారు. తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ 327 ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐఎన్టీయూసీ జెండాను భట్టి విక్రమార్క ఆవిష్కరించి మాట్లాడారు.ప్రపంచ కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు.