Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -బీబీనగర్
మేడే అమరవీరుల పోరాట స్ఫూర్తితో దేశంలో మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలకు సిద్ధం కావాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జాంగిర్ కార్మికులకు పిలుపునిచ్చారు, ప్రపంచ కార్మిక దినోత్సవం 137 సంవత్సరాల రోజు సందర్భంగా నిర్వహించిన మేడే వేడుకలను బీబీనగర్ మండల కేంద్రంతో పాటు జమ్మిలాపేట్, గ్రామాంలో సిఐటియు కార్మిక జెండాలను ఆవిష్కరించారు, సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల 8 గంటల పని చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కార్మికులు ప్రాణ త్యాగాలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి గాడి శ్రీనివాస్, బండారి శ్రీరాములు, వెంకటేష్, ఎల్లంల సత్యనారాయణ, ఈశ్వర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఆలేరుటౌన్: కార్మికుల కర్షకుల పోరాడు సాధించిన హక్కులను నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కాలరాస్తుందని సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు అన్నారు. ఆలేరు పట్టణంలో సోమవారం ఆ పార్టీ కార్యాలయం వద్దఆయన జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ఆ పార్టీ కార్యాలయం నుండి ఆలేరు బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు .బస్టాండ్ వద్ద జెండాను ఆ పార్టీ పట్టణ కార్యదర్శి ఎంఏ.ఇక్బాల్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి ధూపటీ వెంకటేష్, సిఐటియు మండల కన్వీనర్ మోడీగారి రమేష్, శ్రామిక మహిళ జిల్లా నాయకురాలు బోడభాగ్య, సిపిఎం నాయకులు తాళ్లపల్లి గణేష్ ,ఎలుగల శివ, కాసుల నరేష్, వడ్డేమాన్ బాలరాజు, మొరిగాడి మహేష్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బుగ్గ నవీన్, మొరిగాడి అజరు, వడ్డేమాన్ విప్లవ్, చింతల నాగరాజు, మోరిగాడి అంజయ్య , మొగిలి పాక కృష్ణ , సూతగాని సత్య రాజయ్య, గొడుగు దాసు ,ఎక్కాలదే భాస్కర్, ఘనగాని రాజు, ఎర్ర రాజు, బండ శ్రీను, కూరెళ్ళ రవి, మోరిగాడి లక్ష్మణ్ ,యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
పట్టణం లోని 4వ వార్డు లో సీపీఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. ఆ పార్టీ కార్యాలయం, బస్టాండ్ ఆవరణలో జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్ ఆయిల్ సత్తయ్య జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ, మండల అధ్యక్షుడు పుట్ట మల్లేశం, గంగుల శ్రీనివాస్,చైర్మన్ మొగులగని మల్లేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గ్యాదపక నాగరాజు, కార్మిక విభాగం అధ్యక్షుడు కర్రె రాజు, గ్రంథాలయ డైరెక్టర్ ఆడెపు బాలస్వామి సర్పంచ్ లు ఆరుట్ల లక్ష్మీ ప్రసాద్ రెడ్డి,బండ పద్మ పర్వతాలు,కోటగిరి పాండరీ, వడ్ల నవ్య శోభన్ బాబు,జంగ స్వామి,సుంచు మహేందర్,మహిళ అధ్యక్షురాలు క్యాసాగాళ్ల అనసూర్య, టిఆర్ఎస్వి అధ్యక్షుడు మామిడాల భానుచందర్, పిఎసిఎస్ డైరెక్టర్లు గువ్వల నర్సింహులు, అరే మల్లేష్, పట్టణ మండల నాయకులు సీసా రాజేష్, మాదాని తదితరులు పాల్గొన్నారు.
భువనగిరిరూరల్ : సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా మేడే కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీరాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నరసింహ లు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం పని దినాలు 12 గంటలు పెంచాలని కార్మిక చట్టాలు కాలరాస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా అమ్ముతూ కార్పొరేట్లకు దేశ సంపద దోచిపెడుతుందనారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఏదునూరి మల్లేశం, కొండా అశోక్, మండల కమిటీ సభ్యులు గూను గుంట్ల శ్రీనివాస్, మోటి ఎల్లయ్య , కొండాపురం యాదగిరి, ఎల్లంల వెంకటేష్, జిట్టా అంజిరెడ్డి, సిపిఎం పార్టీ గ్రామ శాఖ కార్యదర్శులు ఏదునురి వెంకటేశం, కూకుట్ల కృష్ణ, బాలయ్య బండి, శీను, కొల్లూరు సిద్దిరాజు, భూపాల్ రెడ్డి, బొల్లెపల్లి కిషన్, పాండు, దయ్యాల మల్లేష్, తోటకూరి గణేష్ , తెల్లూరి మాణిక్యం, నరసింహ మల్లయ్య లు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట : ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే ను పురస్కరించుకొని యాదగిరిగుట్ట పట్టణం మండలంలో సీపీఐ(ఎం), సీపీఐ, ఏఐటీయూసీి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నరసింహులు మాట్లాడుతూ ఆనాడు కోసం పోరాటాలు చేసి సాధించుకుంటే నేడు అధికారంలో ఉన్న బీజేపీప్రభుత్వం ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దుచేసి 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చిందన్నారు. జెండాను ఆ పార్టీ మండల కార్యదర్శి బబ్బురి పోశెట్టి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్కే. లతీఫ్ ఎస్ కే.షరీఫ్ కానుగంటి రామచందర్ ,బండ్రెడ్డి ఈశ్వర్ రెడ్డి, సీపీఐ ఆధ్వర్యంలో గ్రామాలలో పార్టీ జెండాలను ఎగురవేశారు. మేడే సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులను సన్మానించారు.
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో హమాలీ, టాంగా, ఆటో, చిన్న వ్యాపారుల, మున్సిపల్, మోటార్ వెహికల్, భవన నిర్మాణ కార్మికుల సంఘాలు జెండాలను ఎగురవేశాయి. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సభ్యులు కళ్లెం కృష్ణ, బండి జంగమ్మ, జిల్లా సమితి సభ్యులు బబ్బూరి శ్రీధర్, మండల కార్యదర్శి జిల్లా జానకి రాములు, మండల సహాయ కార్యదర్శి పేరబోయిన మహేందర్, సీనియర్ నాయకులు బబ్బురి నాగయ్య మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు పేరబోయిన పెంటయ్య, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు గోరేటి రాములు, మండల కార్యవర్గ సభ్యులు రాయగిరి బాలకిషన్,గోపగాని రాజు, మాటూరు మల్లయ్య, పేరబోయిన బంగారి, మునుకుంట్ల నర్సమ్మ, అరే పుష్ప,ముక్కెర్ల పెంటయ్య, ,తదితరులు పాల్గొన్నారు.
ఆలేరురూరల్ : మండలంలోని శర్భనాపురం గ్రామంలో సీపీఐ(ఎం) గ్రామశాఖ ఆధ్వర్యంలో మేడే నిర్వహించారు. ఆ పార్టీ మండల కార్యదర్శి దూపటి వెంకటేష్ జెండావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు సూదగాని సత్యరాజయ్య, బుగ్గ నవీన్, శాఖ కార్యదర్శి కారె రాజు, మాజీ సర్పంచ్‌లు సైదాపురం నర్సయ్య, సూదగాని నర్సమ్మ, నాయకులుసిరిగిరి స్వామి, బుగ్గ ఎర్రయ్య, బద్దం ముత్తిరెడ్డి, సూదగాని నరేందర్, అంగడి నగేష్, గడ్డమీది యాదగిరి, సూదగాని చంద్రకళ, సత్యలక్ష్మి, సిరిగిరి అయిలమ్మ పాల్గొన్నారు.
వలిగొండ : మండలకేంద్రంలో మేడే సందర్భంగా సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి గర్దాస్ నర్సింహ, మండల కార్యదర్శి సిర్పంగి స్వామి జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య మాట్లాడారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు కూర శ్రీనివాస్ తుర్కపల్లి సురేందర్ కల్కూరి రామచందర్ చీర్క శ్రీశైలం రెడ్డి, మండల కమిటీ సభ్యులు కర్ణకంటి యాదయ్య మొగిలి పాక గోపాల్ కందడి సత్తిరెడ్డి,కవిడే సురేష్,దుబ్బ లింగం,భీమనబోయిన జంగయ్య, వివిధ శాఖల కార్యదర్శులు మెట్టు రవీందర్ రెడ్డి బొడ్డుపళ్లి బిక్షపతి గుండెపురి నరసింహ వలిగొండ పట్టణ సహాయ కార్యదర్శి ధ్యాన బోయిన యాదగిరి తదితరులు పాల్గొన్నారు .
రాజాపేట : మే డే పురస్కరించుకొని మండలంలో సీపీఐ(ఎం), సీఐటీయూ ఆధ్వర్యంలో జెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నర్సింహులు మాట్లాడారు. బీజేపీఅనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు బబ్బూరి పోశెట్టి ,బొందుగుల సర్పంచు కంచర్ల శ్రీనివాసరెడ్డి ,ఉపసర్పంచ్ కలకొండ బ్రహ్మచారి, అమాలి సంఘం నాయకులు పాల్గొన్నారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి చిగుళ్ల లింగం ,జిల్లా కౌన్సిల్ సభ్యుడు బొద్దుల ఆదినారాయణ, మండల అసిస్టెంట్ కార్యదర్శి ఇంజ హేమలత, తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూర్ ఎం: మేడే దినోత్సవ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో సిఐటియు, ఏఐటియుసి, ఐఎన్టియూసి, బిఆర్ఎస్ కెవి సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు జెడాలను ఆవిష్కరించి ఘనంగా మేడే వేడుకలను జరుపుకున్నారు. సోమవారం మండల కేంద్రంలో ఆటో యూనియన్ మండల అధ్యక్షులు గడ్డం గణేష్, కారు ఓనర్స్, డ్రైవర్స్ యూనియన్ మండల అధ్యక్షులు కానుకుంట్ల యాదగిరి ట్రాలీ ఆటో యూనియన్ మండల అధ్యక్షులు ఎండి అజీముద్దీన్ లు సిఐటియుసిజెండాను, హమాలీసంఘం అధ్యక్షులు కసిరబోయినసత్తయ్య ఏఐటీయుసిజెండాను, మేస్త్రి సంఘం అధ్యక్షులు బండారు సత్యనారాయణ ఐ ఎన్ టి యు సి జెండాను, బి.ఆర్.ఎస్.కె వి జెండాను మండల అధ్యక్షులు ఎండి రషీద్, సీపీఐ(ఎం) పార్టీ జెండాను పార్టీ టౌన్ కార్యదర్శి రాచమల్ల సత్తయ్య తోపాటు పల్లెర్ల పార్టీ కార్యదర్శి గుణబోయిన స్వామి పార్టీ కూరేల కార్యదర్శి తుమ్మలగూడెం యాదయ్య తిమ్మాపురం పార్టీ కార్యదర్శి తుమ్మల సత్యనారాయణ రెడ్డి తోపాటు మండలంలోని వివిధ గ్రామాల్లో కార్మిక సంఘాల నాయకులు జెండాలు ఆవిష్కరించి ఘనంగా మేడే దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తండ మంగమ్మ శ్రీశైలం గౌడ్ జెడ్పిటిసి కె నరేందర్ గుప్తా ఎంపీటీసీ యాస కవితా ఇంద్రారెడ్డి , సీపీఐ(ఎం) జిల్లా నాయకులు రచ్చ గోవర్ధన్ పార్టీ మండల కార్యదర్శి వేముల బిక్షం డి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బిసు చందర్ గౌడ,్ సిపిఐ మండల కార్యదర్శి జల్ది రాములు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు యాస లక్ష్మారెడ్డి నాయకులు యాస ఇంద్రారెడ్డి, కోరే బిక్షపతి, మేడి రామ నరసయ్య, ఎం సిద్ధులు, పి మల్లేశం, పి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ(ఎం) మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు మండలంలోని పాలడుగు రాగిబావి గ్రామాలలో నిర్వహించిన మేడే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాలడుగు గ్రామ సర్పంచ్ మర్రిపెళ్ళి యాదయ్య, సీపీఎం పార్టీ మండల కమిటీ సభ్యులు దడిపల్లి ప్రభాకర్, కొంపల్లి ముత్తమ్మ, పానిగుల రమేష్, పాలడుగు గ్రామ శాఖ కార్యదర్శి పిట్టల చంద్రయ్య, రాగిబావి శాఖ కార్యదర్శి ఎన్నం వెంకట్ రెడ్డి, సహాయ కార్యదర్శి చితకింది సోమరాజు,మెండు శేఖర్ రెడ్డి, ఎన్నం కలమ్మ, కొంపల్లి గంగయ్య, వడ్డేపళ్లి లక్ష్మణ్, సైదులు, వెండి యాదగిరి, కోసన ఉప్పలయ్య, శ్యామల శ్రీరాములు, పానుగుల నవీన్ పాల్గొన్నారు
భూదాన్ పోచంపల్లి : శ్రమ దోపిడి వ్యతిరేకంగా పని గంటల హక్కుల కోసం పోరాడి ఎంతోమంది బలిదానాల మే డే అని సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు గూడూరు అంజిరెడ్డి అన్నారు. సోమవారం పిల్లాయిపల్లిగ్రామ పరిధిలో సూపర్ ఫైన్ క్రషర్స్ ,సీఐటీయూ కార్యదర్శి అందేలా బాలయ్య జండా ఎగరవేశారు మడ్ల నరసింహ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ు ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రెటరీ రవి వర్కింగ్ ప్రెసిడెంట్ కొంతం వెంకటేష్ కోశాధికారి వాకిటి నరేష్ కార్మికులు పాల్గొన్నారు
మే డే సందర్భంగా బైక్ ర్యాలీ
మండల వ్యాప్తంగా పలు గ్రామాలలోసీఐటీయూ, సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణలు చాలా ఉత్సాహంగా జరిగాయని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ అన్నారు. మేడే సందర్భంగా పోచంపల్లిలో నిర్వహించిన జెండా ఆవిష్కరణలో ఆయన మాట్లాడారు.ూ శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పని గంటల హక్కుల కోసం పోరాడి ఎంతోమంది కార్మికులు చెందిన రోజు మేడే వారోత్సవాలను నిర్వహించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి కోడె బాల నరసింహ , నాయకులు కోట రామచంద్రారెడ్డి ప్రసాదం విష్ణు గూడూరు బుచ్చిరెడ్డి సిఐటి మండల కన్వీనర్ మంచాల మధు సిపిఎం నాయకులు నెలకండి జంగయ్య కలుకూరి బిక్షపతి రామ్ రెడ్డి అలీ జగన్ రెడ్డి బుగ్గ లక్ష్మయ్య, గంగారెడ్డి బిక్షపతి కృష్ణారెడ్డి లక్ష్మయ్య మల్లయ్య అంజయ్య హమాలి కార్మికులు తదితరులు పాల్గొన్నారు .
భువనగిరి : మేడే అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమాలకు సిద్ధం కావాలని ప్రభుత్వా లు అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధా నాలపై ఉద్యమాలకు సిద్ధం కావాలని సి ఐ టి యు అధ్యక్షులు దాసరి పాండు అన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా భువనగిరి పట్టణ మండలంలో ఉన్న గ్రామ పంచాయతీ మున్సిపల్ తోపుడు బండ్లు పరిశ్రమలలో తదితర రంగాల జండాలను ఎగర వేసుకొని భువనగిరి పట్టణ కేంద్రంలో ఉన్న రైతు బజార్ ఎదురుగా ప్రిన్స్ చౌరస్తా వద్ద గండమల్ల మాథయ్య అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చందుపట్ల హమలి కార్మికులు సీఐటీయూలో చేరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మాయ కృష్ణ నాయకులు ఊదరి రామచందర్, కిష్టయ్య, అంజయ్య, జానీ, మాల నరసింహ, ఐలయ్య, వెంకటేశం, కొండయ్య, కుమార్, రవి, శాంతమ్మ, కుమారి, లక్ష్మి పాల్గొన్నారు.
కేంద్రంలోని బీజేపీి ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని, వాటి స్థానంలో పాత 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని తెలంగాణ రాష్ట్ర మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ , వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మిషన్ భగీరథ జిల్లా ఆఫీస్ ముందు జెండాను ఆయన ఎగురవేశారు.ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీను, వర్కింగ్ ప్రసిడెంట్ సిహెచ్ మల్లేశం, నాయకులు బాలరాజు, కుమారస్వామి, శ్రీకాంత్, ప్రసాద్, సంపత్ కుమార్, నాగరాజు, క్రిష్ణ, చంద్రమౌళి, మత్స్యగిరి, నవీన్, నర్సింహ, శ్రీను, ప్రశాంత్, ఉపేందర్, జంగయ్య పాల్గొన్నారు.
యూటీఎఫ్ ఆధ్వర్యంలో
అంతర్జాతీయ మేడే కార్మికుల దినోత్సవ సందర్భంగా టీఎస్ యుటిఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేస్తున్న టీఎస్ యుటిఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా కోశాధికారి శ్రీ ఇటికాల మల్లేశం గారు. ఈ సందర్భంగా టిఎస్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ ముక్కెర్ల యాదయ్య గారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల ఉద్యోగుల కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే పోరాటాలే మార్గమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆడిట్ కన్వీనర్ శ్రీ జివి రమణ రావు , జిల్లా ఆడి కమిటీ సభ్యులు గుజ్జ బాలయ్య , కె గోపాల్ , జిల్లా కమిటీ సభ్యులు కంచు గట్లవెంకన్న ,దాకోజు నరేష్ పాల్గొన్నారు .
జిల్లాకేంద్రంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భారీ బైక్ ,ఆటో ర్యాలీని సీపీిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు జెండాను ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ హాస్పిటల్, కొత్త వ్యవసాయ మార్కెట్ యార్డ్, కొత్త బస్టాండ్ ,ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగ హైదరాబాద్ చౌరస్తా వద్ద ఏఐటీయూసీ జెండాను ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.డి ఇమ్రాన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి గనబోయిన వెంకటేష్, కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, జిల్లా కమిటీ సభ్యులు దాసరి లక్ష్మయ్య, సామల భాస్కర్ నాయకులు ముదిగొండ బస్వయ్య, చొప్పరి సత్తయ్య, వల్దాస్ నర్సింహ, వాణి, భాగ్యమ్మ, పుష్ప, పాల్గొన్నారు.
మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐఎన్టియుసి ఆధ్వర్యంలో సమ్మధ్ ఆ సంఘం కార్యాలయం వద్ద మున్సిపల్ అధ్యక్షుడు పడిగెల ప్రదీప్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ,మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ ,మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర,28వ వార్డు కౌన్సిలర్ కైరంకొండ వెంకటేష్ , ఎస్సీ సెల్ అధ్యక్షులు దర్గాయి హరిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
మోత్కూరు మండలంలోని పాలడుగు గ్రామంలో సర్పంచ్ మర్రిపల్లి యాదయ్య, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలోఆ పార్టీ మండల కమిటీ సభ్యులు దడిపల్లి ప్రభాకర్, కొపంల్లి ముత్తయమ్మ, పానిగుల రమేశ్, శౄఖ కార్యదర్శి పిట్టల చంద్రయ్య, రాగిబావి శాఖ కార్యదర్శి ఎన్నం వెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శి చింతకింది సోమరాజు, మెండు శంకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
అడ్డగుడూర్ : మండలంలో సీపీఐ(ఎం),సిఐటియు, ప్రజా సంఘాలు ,భవన నిర్మాణ సంఘం,గ్రామపంచాయతీ కార్మికుల,కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే సందర్భంగా జెండా ఎగురవేసి ఘనంగా వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి బుర్రు అనిల్ కుమార్ పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్్ మండల కార్యాలయం ముందు కార్మిక సంఘం మండల అధ్యక్షులు ఆసర్ల బిరుమల్లు జెండా ఎగురవేశారు.ముఖ్యఅతిధిగా ఆ పార్టీ మండల అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి,మాజీ ఎంపిటిసి జనార్ధన్ రెడ్డి,నాగులపల్లి.దేవగిరి, సీపీఎం మండల కమిటీ సభ్యులు భూపతి నర్సయ్య,చిత్తలూరి మల్లయ్య,శీలం శ్రీనివాస్,చిత్తలూరి స్వామి,భవన నిర్మాణం సంఘం నాయకులు, మల్లేష్,కొండయ్య, తాపే యూనియన్ సంఘం అధ్యక్షుడు గజ్జెల్లి రవి, గ్రామపంచాయతీ కార్మికులు బాలెంల మల్లయ్య,సజ్జు, చంద్రయ్య,రాములమ్మ, తదితరులు పాల్గొన్నారు.
సంస్థాన్‌నారాయణపురం : మండలంలో సిఐటియు,ఏఐటీయూసీ, సీపీిఐ(ఎం), సీపీఐ,సిపిఐ(ఎంఎల్) ఆధ్వర్యంలో ఘనంగా మేడా ఉత్సవాలను నిర్వహించారు. సీపీిఐ(ఎం) అనుబంధ సంఘమైన సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని శేరిగూడెం, చిమిర్యాల,అల్లెందేవి చెరువు, లింగంవారి గూడెం,గుజ్జ,మహమ్మదాబాద్, పుట్టపాక, వావిల్లపల్లి,చిల్లాపురం, కంకణాలగూడెం, కోతులాపురం గ్రామాల్లో కార్మిక జెండాల ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు.ఈకార్యక్రమంలో సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శివర్గసభ్యులుదొనూరి నర్సిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు గుంటోజు శ్రీనివాసా చారి,మండలకార్యదర్శి దొడ యాదిరెడ్డి, తుమ్మల నర్శిరెడ్ది,దొంతగాని పెద్దలు, చింతకాయల నర్సింహా,లాలయ్యా, పిట్ట రాములు,చాడనర్సింహా,మెరుగు పాండ య్య,గుంటూజు సుదర్శన్‌చారి,సతయ్య, లాలాయ్య, బొడ్డు అబ్బయ్య,మందడి అమరేందర్ రెడ్డి,దాసరి పెద్దులు, జెట్టి లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.