Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్రూరల్
సీఎం సహాయనిధి పేదల ఆరోగ్యభద్రతకు భరోసా అని సర్పంచ్ షస్త్రకల్ సలీమారంజాన అన్నారు.మంగళవారం గ్రామానికి చెందిన వీరమ్మకు రూ.36 వేలు, మేకపోతుల వీరమ్మకు రూ.43 వేలు, ప్రార్థనబోయిన సైదమ్మకు రూ.14 వేలు, జొన్నలగడ్డ నాగమణికి రూ.60 వేలు, మెండెం లింగమ్మకు రూ.20 వేలు, ముదిగొండ సైదమ్మకు రూ.18 వేలు సీఎంఆర్ఎఫ్ నుండి మంజూరు కాగా ఆయన లబ్దిదారుల ఇంటింటికి వెళ్లి అందజేశారు.అనంతరం మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పేదలకు వరంలాంటిదన్నారు.ఈ కార్యక్రమంలో గండు సైదులు, షేక్అలీమ్, పాషా, ఆవుల వెంకటయ్య, గండు చిన్నసైదులు, చిమటసైదులు, తాళ్ల వెంకన్న, నందిగామ రాములు, మాడుగుల కనకయ్య, బత్తిని నాగరాజు, వట్టెపుమధు, కాంపాటి శ్రీను పాల్గొన్నారు.
పాలకవీడు: మండలంలోని 11 గ్రామాలకు చెందిన లబ్దిదారులకు రూ.6,92,000 విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయి. మంజూరైన చెక్కులను బీఆర్ఎస్ మండలఅధ్యక్షుడు కిష్టిపాటి అంజిరెడ్డి స్వయంగా వెళ్లి అందజేశారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మెన్ సత్యనారాయణరెడ్డి, ఆ పార్టీ ఉపాధ్యక్షులు తాటికొండ వెంకట్రెడ్డి, మండల అధికారప్రతినిధి పసుపులేటిసైదులు పాల్గొన్నారు.