Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
నవతెలంగాణ-తుంగతుర్తి
ధాన్యం కొనుగోలుకేంద్రాల్లో కొనుగోళ్లను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ నిర్వాహకులకు సూచించారు.మంగళవారం మండల కేంద్రంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలుకేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షం కారణంగా మొలకెత్తుతున్న ధాన్యాన్ని వేగతరం చేయాలని సూచించారు. కేంద్రం నిర్వాహకులతో లారీలు, గోనెసంచుల సప్లై, మిల్లర్లు ధాన్యం దిగుమతి ఆలస్యం వంటి సమస్యలను తమ దృష్టికి తెస్తే వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాంటాలు త్వరగా జరిగేటట్లు చూడాలని కోరారు. కార్యక్రమంలో డీపీఓ పెంటయ్య, ఏపీఎం నర్సయ్య, సీసీలు ఇద్దయ్య, యాదగిరి, నిర్వాహకులు నర్మదా, రైతులు పాల్గొన్నారు.