Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మద్దిరాల
చికాగో అమరవీరుల స్ఫూర్తితో పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేకవిధానాలకు వ్యతిరేకంగా కార్మిక,కర్షక సంఘాలు ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు పిలుపునిచ్చారు.మంగళవారం మేడే వారోత్సవాల్లో భాగంగా మండలకేంద్రంలో ఆ పార్టీ జెండాను ఆవిష్కరించారు. మాట్లాడారు.నేడు దేశంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్చి వేస్తూ కార్మికుల ప్రయోజనాలకు నష్టం కలిగించే చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు.కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు,వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికవర్గం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, జిల్లా కమిటీ సభ్యులు బుర్ర శ్రీనివాస్,కందాల శంకర్రెడ్డి, పులుసుసత్యం, మండల కార్యదర్శి కల్లపల్లి భాస్కర్, నాయకులు వీరయ్య, రాములు, మల్లయ్య, వెంకన్న పాల్గొన్నారు.