Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నూతనకల్
తెలంగాణ రాష్ట్రమేర్పడినప్పటికీ గిరిజన ప్రజల నీటి సమస్య తీరని దుస్థితి,గుక్కెడు మంచినీటి కోసం గిరిజనవాసుల కష్టాలు పడుతున్న తీరు మండలపరిధిలోని బక్కహేమ్లాతండా తండా ఆవాసం మాన్సింగ్తండాలో నెలకొంది.గతంలో ఉమ్మడి సోమ్లాతండా గ్రామ పంచాయతీ పరిధిలో ఆవాస ప్రాంతాలైన మాన్సింగ్తండాలో బోరువేయించారు.గతంలో ఈ బోరును ఉమ్మడి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నీటి సరఫరా చేయబడి పూర్తిగా గ్రామ పంచాయతీకి చెందింది. కరెంటు బిల్లు సైతం గ్రామపంచాయతీ చెల్లిస్తూ వచ్చింది.అదే మాదిరిగా నూతనంగా ఏర్పడిన బక్కహేమ్లాతండా గ్రామపంచాయతీ కూడా నడుపుతూ విద్యుత్ బిల్లును సైతం గ్రామపంచాయతీ నిధుల నుండే చెల్లిస్తుంది.రోడ్డు పక్కనే ఉన్న ఈ బోరుకు ఆనుకుని వ్యవసాయభూమి రైతు ఈ భూమి తనదేనంటూ గతంలో నడవకుండా ఆపివేశారు.ఈవిషయంపై సర్పంచ్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా సమస్యను పరిష్కరించారు.నీటిని సరఫరా చేశారు.కానీ కొద్ది రోజుల నుండి తండాకు నీటిని సరఫరాను ఆ రైతు నిలిపివేశాడు. సర్పంచ్ కేసు పెట్టి పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు.దీంతో ప్రజలు నీటి కోసం పరిసర ప్రాంతాల్లోని వ్యవసాయబావుల వద్దకు వెళ్లి మంచినీటిని తెచ్చుకుంటున్నారు. వెంటనే గ్రామపంచాయతీ ఆవరణంలో బోరు సమస్యను అధికారులు పరిష్కరించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని తండావాసులు కోరుతున్నారు.