Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
రేషన్ షాపుల ద్వారా 12 రకాల నిత్యవసర సరుకులు పేద ప్రజలకు ఉచితంగా అందించాలని పీఓడబ్య్లూ, పీవైఎల్ ఆధ్వర్యంలో మంళవారం కలెక్టరేట్ ఏఓ శ్రీదేవికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీిఓడబ్య్లూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్యూ రాష్ట్ర సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్కుమార్,పీవైఎల్ జిల్లా నాయకులు వేర్పుల పరుశరామ్ మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకొచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా కుటుంబ సమగ్రసర్వే నిర్వహించిందన్నారు. భూములు, ఇండ్లస్థలాలు, కొలువులు, ఇండ్లు,రేషన్ కార్డులు వస్తాయని ప్రజలు ఆశించారని కానీ ఆచరణలో జరిగింది,ఒరిగింది ఏమీ లేదన్నారు.వినతిపత్రం అందజేసిన వారిలో పీఓడబ్య్లూ జిల్లా అధ్యక్షులు చంద్రకళ, కోశాధికారి జయమ్మ, పీవైఎల్ జిల్లా నాయకులు గోగుల వీరబాబు, రాజశేఖర్ ఉన్నారు.