Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిశీలించిన డీఎంహెచ్ఓ
నవతెలంగాణ-పెన్‌పహాడ్
రాష్ట్రంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న 'ఆరోగ్య మహిళ' కార్యక్రమానికి మండలవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది.ప్రతి మంగళవారం మహిళలకు మాత్రమే నిర్వహించే 57 రకాల వైద్య పరీక్షల కొరకు ప్రజాప్రతినిధుల ప్రత్యేక చోరువతో ఓపీ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కాగా మంగళవారం ఓపీ సంఖ్య 172 కు చేరినట్లు వైద్యాధికారి స్రవంతి తెలిపారు. కాగా కార్యక్రమాన్ని ఎంపీపీ నెమ్మాది భిక్షం, డీఎంహెచ్ఓ కోటాచలం పరిశీలించారు. ఆరోగ్య మహిళ పథకం ద్వారా పరీక్షలు పొందేందుకు వచ్చే వారి కొరకు మంత్రి జగదీశ్‌రెడ్డి మధ్యాహ్న భోజనాన్ని సొంత ఖర్చుతో మూడు వారాలుగా ఏర్పాటు చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి వెంకటరమణ, వైద్యాధికారులు నజీయ, భవాని, సాహితి, ఎంఎల్‌హెచ్‌పీలు ప్రియాంక, ఝాన్సీ, మనీషా,స్టాఫ్‌నర్సులు సుజాత, రాంబాయి, ఏఎన్ఎంలు కళావతి, ఇందిరా, సునీత, సుభద్ర, ఫార్మాసిస్ట్ అనూష, లాబ్ టెక్నీషియన్ రాజు, ఆశాలు, తదితరులు పాల్గొన్నారు.